గతంలో దుందుడుకు మనస్తత్వానికి పేరుగాంచిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌లో నిషేధం అనంతరం మార్పు కన్పిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సిడ్నీలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ముగిశాక తన వస్తువులను అభిమానికిచ్చి అందరి మనసు గెలుచుకున్నాడు. సోమవారం కివీస్‌తో మ్యాచ్ సందర్భంగా కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన వార్నర్.. అనంతరం మైదానానికి తిరిగొస్తూ తన బ్యాట్‌ను అభిమానికిచ్చాడు. తాజాగా ఈ వీడియలో సోషల్ మీడియాలో వైరలైంది.
వార్నర్ ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా తన గ్లోవ్‌లను అభిమానులకిచ్చి స్వీట్ సర్ప్రైజ్ చేశాడు. గత సమ్మర్లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన అనంతరం తన వస్తువును అభిమానులకు కానుకగా ఇచ్చాడు. అప్పుడు కూడా అభిమానులు వార్నర్ చేసిన పనికి ఎంతగానో సంతోషించారు. తాజా ఘటనపైకూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : సచిన్, కోహ్లీలను తప్పుబట్టిన ఇర్ఫాన్ పఠాన్
మరోవైపు వార్నర్ ఘటన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ కెవిన్ రాబర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. రాబోయే తరానికి వార్నర్ తన చర్యల ద్వారా స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడాడు. వార్నర్ కానుక ఇచ్చిన క్షణాలను అభిమాని జీవితాంతం గుర్తుంచుకుంటారని ట్వీట్ చేశారు. ఇక పాక్‌పై చూపెట్టిన సూపర్ ఫామ్‌నే కివీస్‌పైనా వార్నర్ చూపించాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాడు.
Read Also : Indore T20లో మంచును అరికట్టేందుకు క్యూరేటర్ చిట్కాలు