యాప్నగరం

భారత పర్యటనకు ఆసీస్ జట్టు ఇదే..!

సెప్టెంబర్ నుంచి భారత్‌లో జరగనున్న వన్డే, టీ20 మ్యాచ్‌ల కోసం ఆసీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది.

TNN 18 Aug 2017, 2:49 pm
సెప్టెంబర్ నుంచి భారత్‌లో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ఎంపిక చేసింది. ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్, నాథన్ కౌల్టర్ నైల్‌లకు ఆసీస్ జట్టులో మళ్లీ స్థానం దక్కింది. 2015 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఫాల్కనర్‌ను ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. కానీ ఉపఖండ పిచ్‌లపై అతడి అనుభవం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో భారత పర్యటనకు అతణ్ని ఎంపిక చేశారు.
Samayam Telugu australia announce squad for india odi tour
భారత పర్యటనకు ఆసీస్ జట్టు ఇదే..!


గాయం కారణంగా జట్టుకు దూరమైన కౌల్టర్ నైల్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆకట్టుకోవడంతో అతణ్ని కూడా ఆస్ట్రేలియా బోర్డు ఎంపిక చేసింది. గాయపడిన క్రిస్ లిన్, జాన్ హేస్టింగ్స్, జేమ్స్ ప్యాటిన్‌సన్, మిచెల్ స్టార్క్‌లను బోర్డు పక్కనబెట్టింది. పాదం గాయం నుంచి కోలుకుంటున్న స్టార్క్‌కు విశ్రాంతినిచ్చింది.

టీ20 జట్టులో జాసన్ బెహ్రెన్‌డ్రాఫ్, కేన్ రిచర్డ్‌సన్‌లు ఎంపికయ్యారు. జాస్ హెజెల్‌వుడ్ టీ20లకు ఎంపిక కాలేదు. ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్, కీపర్ టిమ్ పైన్‌లకు టీ20 జట్టులో చోటు దక్కింది. కౌల్టర్ నైల్‌ను పొట్టి ఫార్మాట్‌కు కూడా ఎంపిక చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 11 మధ్య ఆసీస్ జట్టు భారత గడ్డ మీద ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

వన్డే జట్టు: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ట్రావిస్ హెడ్, మాథ్యూ వేడ్, నాథన్ కౌల్టర్ నైల్, ప్యాట్ కమిన్స్, జేమ్స్ ఫాల్కనర్, హేజెల్‌వుడ్, అస్తన్ అగర్, హిల్టన్ కార్డ్‌రైట్, పాట్ ఆడమ్ జంపా.

టీ20 జట్టు: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, డానియెల్ క్రిస్టియన్, నాథన్ కౌల్టర్ నైల్, ప్యాట్ కమ్మిన్స్, ఆరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, హెన్రిక్యూస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ పైనీ, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.