యాప్నగరం

తొలి వన్డేలో శిఖర్ ధావన్‌కి 3 లైఫ్స్.. 74 ఔట్

ఆస్ట్రేలియా ఫీల్డింగ్ తప్పిదాల్ని శిఖర్ ధావన్ సొమ్ము చేసుకోలేకపోయాడు. మూడు సార్లు రనౌట్ ప్రమాదాన్ని తప్పించుకున్న ధావన్.. 74 పరుగుల వద్దే వికెట్ చేజార్చుకున్నాడు.

Samayam Telugu 14 Jan 2020, 4:25 pm
ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్‌ శిఖర్ ధావన్‌కి మూడు జీవనదానాలు లభించాయి. మ్యాచ్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (10: 15 బంతుల్లో 2x4)తో సమన్వయలోపం కారణంగా రనౌట్ ప్రమాదాన్ని తప్పించుకున్న శిఖర్ ధావన్ (74: 91 బంతుల్లో 9x4, 1x6).. ఆ తర్వాత కేఎల్ రాహుల్‌(47: 61 బంతుల్లో 4x4)తోనూ అదే ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. చివరిగా ఔటయ్యే ముందు కూడా ఓసారి అతను రనౌటవ్వబోయాడు. అయితే.. ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ తప్పిదంతో అతనికి ఛాన్స్ లభించింది. కానీ.. జట్టు స్కోరు 140 వద్ద పాట్ కమిన్స్ బౌలింగ్‌లో గాల్లోకి బంతిని లేపేసిన ధావన్ ఫీల్డర్‌ అగర్‌కి సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Samayam Telugu Shikhar Dhawan Run Out


Read More: విరాట్ కోహ్లీ ఏంటి ఈ తికమక..? భారత్ తుది జట్టు ఎంపికపై ఫ్యాన్స్ విసుర్లు

గత ఏడాది జులైలో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత ఫామ్‌ కోల్పోయిన శిఖర్ ధావన్.. ఇటీవల శ్రీలంకతో ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. కానీ.. ఈరోజు ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో మొదట ఈ ఓపెనర్ కాస్త తడబడినట్లు కనిపించింది. ముఖ్యంగా.. షాట్ ఆడిన తర్వాత పరుగుకి రోహిత్ శర్మని పిలవడం.. మళ్లీ వెనక్కి వెళ్లడం.. ఆ తర్వాత రాహుల్ విషయంలోనూ అదే జరిగింది. ఆఖరిగా విరాట్ కోహ్లీ అయితే.. షాట్ ఆడి క్రీజులో ఉండగానే శిఖర్ ధావన్ దాదాపు పిచ్ మధ్యలోకి వచ్చేశాడు.

Read More: రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే టీవీకి అతుక్కుపోతాను


మొత్తంగా మూడు జీవనదానాలు లభించినప్పటికీ శిఖర్ ధావన్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కమిన్స్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా బంతిని ధావన్ హిట్ చేయడానికి ప్రయత్నించగా.. అది బ్యాట్ ఎడ్జ్ తాకి కవర్స్‌లో గాల్లోకి లేచిపోయింది. దీంతో.. నిరాశగా ధావన్ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.