యాప్నగరం

IND vs AUS: భారత్‌తో తొలి టెస్టుకి ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ దూరం

ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌ని 1-2తో చేజార్చుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌ని మాత్రం 2-1తో కైససం చేసుకుని లెక్క సమం చేసింది. దాంతో.. నాలుగు టెస్టుల సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Samayam Telugu 9 Dec 2020, 8:35 am
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ముంగిట భారత్ జట్టుకి ఉత్సాహానిచ్చే వార్త. ఆసీస్ సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోడంతో డిసెంబరు 17న అడిలైడ్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తాజాగా వార్నర్ ఓ ప్రకటనని విడుదల చేశాడు.
Samayam Telugu IND vs AUS (Image Credits: Twitter)


భారత్‌తో నవంబరు 29న సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. శిఖర్ ధావన్ కొట్టిన బంతిని అడ్డుకునేందుకు డేవిడ్ వార్నర్ డైవ్ చేయగా.. అతని గజ్జలో గాయమైంది. దాంతో.. చివరి వన్డేతో పాటు ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్‌కీ డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు.

దాదాపు 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నా గాయం నుంచి తాను పూర్తిగా కోలుకోలేకపోయానని డేవిడ్ వార్నర్ అంగీకరించాడు. నామమాత్రపు ఫిట్‌నెస్‌తో తాను మైదానంలోకి దిగబోనని స్పష్టం చేసిన వార్నర్.. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించేందుకు మరో 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు వెల్లడించాడు. దాంతో.. డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్‌లో ప్రారంభంకానున్న రెండో టెస్టులో అతను ఆడే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.