యాప్నగరం

Big Breaking: ఆసీస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో ఆయన మృతి చెందారు. సైమండ్స్ మృతితో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

Authored byAshok Krindinti | Samayam Telugu 15 May 2022, 5:34 am
Samayam Telugu ఆండ్రు సైమండ్స్
ఆసీస్ దిగ్గజ ఆటగాడు, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. సైమండ్స్ మృతితో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఇటీవలె దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో దిగ్గజ ఆటగాడు మరణించడం క్రికెట్ అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

1998లో పాకిస్థాన్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన సైమండ్స్.. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. మొత్తం 198 వన్డేల్లో 5088 రన్స్ చేయగా.. ఇందులో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 37.26 యావరేజ్‌తో 133 వికెట్లు తీసుకున్నాడు. బెస్ట్ బౌలింగ్ 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.

2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ఆరంభించిన ఈ దిగ్గజ ఆటగాడు.. 26 మ్యాచ్‌ల్లో 1463 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో 14 టీ20 మ్యాచ్‌లు ఆడి.. రెండు హాఫ్ సెంచరీల సాయంతో 337 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 8 వికెట్లు కూడా తీశాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్‌లో సైమండ్స్‌ను డెక్కన్ ఛార్జర్స్ రూ.5.4 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.