యాప్నగరం

పాక్ క్రికెట్లో కుదుపు.. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన అలీ

అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్లో మరో సంచలనం చోటు చేసుకుంది.

TNN 9 Feb 2017, 6:19 pm
అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఆ జట్టు వన్డే కెప్టెన్సీ నుంచి అజహర్ అలీ వైదొలగ్గా.. అతడి స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమిస్తూ పీసీబీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ 1-4 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఆ సిరీస్‌లో అజహర్ అలీ చివరి మూడు ఇన్నింగ్స్‌లో వరుసగా 24, 7, 6 పరుగులతో పేలవ ప్రదర్శన చేశాడు. గత 23 మ్యాచ్‌ల్లో అలీ కేవలం ఒక శతకం, రెండు అర్ధ శతకాలు మాత్రమే సాధించగలిగాడు. దీంతో అలీని పాక్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు గళం విప్పారు.
Samayam Telugu azhar ali quits as pakistans odi captain
పాక్ క్రికెట్లో కుదుపు.. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన అలీ


జట్టు పగ్గాలు మార్పు అనంతరం అలీ మాట్లాడుతూ కెప్టెన్సీ భారం తన ఆటపై ప్రభావం చూపుతోందని.. ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆటపై దృష్టి సారించేందుకు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కొద్దిసేపటికే టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీగా కూడా తప్పకుంటున్నట్లు ట్విటర్లో ప్రకటించాడు. మార్చి చివర్లో పాకిస్థాన్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ జట్టు.. మరో రెండు పాయింట్లు కోల్పోతే ప్రపంచ కప్‌కు అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.