యాప్నగరం

Dhaka ODI: టాస్ గెలిచిన బంగ్లా.. సిరీస్ నుంచి పంత్ ఔట్.. కొత్త పాత్రలో రాహుల్‌!

Dhaka ODI: భారత్‌, బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే ద్వారా పేసర్ కుల్దీప్ సేన్ అరంగేట్రం చేస్తున్నాడు. గాయం కారణంగా రిషబ్ పంత్ వన్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ నలుగురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతోందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ మీద తేమ ఉండటంతో టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగ్ ఎంచుకునేవాడినని హిట్ మ్యాన్ తెలిపాడు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 4 Dec 2022, 11:35 am

ప్రధానాంశాలు:

  • తొలి వన్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్
  • అరంగేట్రం చేయనున్న కుల్దీప్ సేన్
  • సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Team India
Team India
ఢాకా వేదికగా భారత్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గాయపడటంతో.. టీమిండియాతో వన్డే సిరీస్‌కు లిట్టన్ దాస్ నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. కివీస్ పర్యటనలో వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. బంగ్లాతో వన్డే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. పేసర్ కుల్దీప్ సేన్‌ భారత్ తరఫున అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటి వరకూ ఓపెనర్‌గా ఆడిన రాహుల్.. ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడంతోపాటు.. వికెట్ కీపర్‌గానూ వ్యవహరించనున్నాడు.

మెడికల్ టీమ్‌తో కన్సల్టేషన్ తర్వాత వన్డే జట్టు నుంచి రిషబ్ పంత్‌ను రిలీజ్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అతడికి రీప్లేస్‌మెంట్‌ను సైతం బోర్డ్ ప్రకటించలేదు. దీంతో ఢాకా వన్డేలో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. తొలి వన్డేకు అక్షర్ పటేల్ అందుబాటులో ఉండటం లేదని బోర్డు తెలిపింది. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ రూపంలో నలుగురు ఆల్‌రౌండర్లు ఆడుతున్నారని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ సేన్.
బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ షంటో, షకీబ్ అల్ హసన్, ముషాఫిఖుర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్ముదుల్లా, అఫిఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మీరజ్, హసన్ మహ్ముద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, ఇబాదత్ హొస్సేన్.

Read More Sports News And Telugu News
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.