యాప్నగరం

బంగ్లాలో కంగారూలకి టైట్ సెక్యూరిటీ..!

దశాబ్దం తర్వాత తమ దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీ భద్రత కల్పిస్తోంది. 2006లో రికీ పాంటింగ్ సారథ్యంలో

TNN 19 Aug 2017, 3:44 pm
దశాబ్దం తర్వాత తమ దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీ భద్రత కల్పిస్తోంది. 2006లో రికీ పాంటింగ్ సారథ్యంలో కంగారూలు బంగ్లాదేశ్‌లో చివరిసారి పర్యటించారు. అనంతరం భద్రత కారణాలతో పర్యటనల్ని రద్దు చేసుకున్న ఆ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు వచ్చింది. జట్టు కోసం ప్రత్యేకంగా విమానాశ్రయం నుంచి బస చేసే హోటల్ వరకూ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించి భద్రత కల్పించారు.
Samayam Telugu bangladesh offer tight security as australia
బంగ్లాలో కంగారూలకి టైట్ సెక్యూరిటీ..!


రెండేళ్ల క్రితం బంగ్లాలో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు తొలుత అంగీకరించిన ఆస్ట్రేలియా.. అనంతరం చివరి నిమిషంలో రద్దు చేసుకుంది. గత ఏడాది అండర్-19 ప్రపంచకప్ కోసం భద్రతను కారణంగా చూపుతూ కనీసం జట్టును కూడా పంపలేదు. తాజా పర్యటన కూడా తర్జనభర్జనల మధ్య చివర్లో ఖరారైంది. ఆస్ట్రేలియా బోర్డుతో క్రికెటర్లు జీతాల విభేదాల కారణంగా.. తొలుత పర్యటనని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ.. ఆ సమస్య పరిష్కారం కావడం, క్రికెటర్ల భద్రతకి బంగ్లాదేశ్ పూర్తి భరోసా ఇవ్వడంతో కంగారూల జట్టు బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టింది. ఢాకా వేదికగా ఆగస్టు 27న తొలి టెస్టు ప్రారంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.