యాప్నగరం

బంగ్లాదేశ్ డీఆర్‌ఎస్‌కి న‌వ్వుకున్న కోహ్లి

హైదరాబాద్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో తొలిరోజు ఓ హాస్యాస్పద సన్నివేశం చోటు చేసుకుంది.

TNN 9 Feb 2017, 4:36 pm
హైదరాబాద్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో తొలిరోజు ఓ హాస్యాస్పద సన్నివేశం చోటు చేసుకుంది. స్పిన్నర్ తైజుల్ విసిరిన బంతిని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కవర్స్ దిశగా ఆడాడు. అయితే కీపర్‌గా ఉన్న బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ కోహ్లి బ్యాట్‌కు బంతి తాకలేదు అనుకుని ఔట్ అని అప్పీల్ చేయడమే కాకుండా.. ఏకంగా డీఆర్ఎస్ అడిగాడు. దీంతో కోహ్లి కాసేపు ముసిముసిగా నవ్వుతూ కనిపించాడు.
Samayam Telugu bangladesh review kohli smiled
బంగ్లాదేశ్ డీఆర్‌ఎస్‌కి న‌వ్వుకున్న కోహ్లి


Bangladesh review one off the bat? https://t.co/GZpX8p6b5v — Samayam Telugu (@SamayamTelugu) February 9, 2017
డీఆర్ఎస్ అడిగే ముందు బ్యాట్స్‌మెన్‌కు దగ్గరగా ఉన్న ఫీల్డర్లని రహీమ్ అడిగినా వారి నుంచి అనుకూల స్పందన రాలేదు. అయినా రహీమ్ మొండిగా డీఆర్ఎస్‌కు వెళ్లాడు. థర్డ్ అంపైర్ నుంచి నాటౌట్‌ నిర్ణయం వెలువడిన తర్వాత సహచరులు సైతం రహీమ్‌ను చూసి నవ్వుకున్నారు. అప్పటికి భారత్ స్కోరు 61.1 ఓవర్లలో 223/2 కాగా.. క్రీజులో కోహ్లి 31 పరుగులతో ఉన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.