యాప్నగరం

బంగ్లా‌పై గెలిచి ఊపిరి పీల్చుకున్న విండీస్

పసికూన బంగ్లాదేశ్‌ చేతిలో దాదాపు ఓటమి ఖాయమైన దశలో అనూహ్యంగా పుంజుకుని వెస్టిండీస్ విజయాన్ని అందుకుంది. గయానా వేదికగా

Samayam Telugu 26 Jul 2018, 12:07 pm
పసికూన బంగ్లాదేశ్‌ చేతిలో దాదాపు ఓటమి ఖాయమైన దశలో అనూహ్యంగా పుంజుకుని వెస్టిండీస్ విజయాన్ని అందుకుంది. గయానా వేదికగా తాజాగా ముగిసిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 49.3 ఓవర్లలో 271 పరుగులకి ఆలౌటవగా.. ఆఖరి వరకూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించిన బంగ్లాదేశ్ చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయలేక చతికిలపడింది. దీంతో.. మూడు వన్డేల ఈ సిరీస్‌1-1తో సమమైంది.
Samayam Telugu prv_1532579120


క్రిస్‌గేల్ (29), ఎవిన్ లావిస్ (12) విఫలమైనా.. సిమ్రాన్ హెట్‌మార్ (125: 93 బంతుల్లో 3x4, 7x6) శతకం బాదడంతో వెస్టిండీస్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఛేదనలో బంగ్లాదేశ్ ఆఖరి వరకూ కరీబియన్లకి గట్టి పోటీనిచ్చింది. ఆ జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (54), షకీబ్ అల్ హసన్ (56), కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (68) అర్ధశతకాలు బాదడంతో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది.

ఛేదనలో 49 ఓవర్లు ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 264/5తో నిలిచి గెలిచేలా కనిపించింది. కానీ.. చివరి ఆరు బంతుల్లో విజయానికి 8 పరుగులు అవసరంకాగా.. ఆఖరి ఓవర్ వేసిన హోల్డర్ తొలి బంతికే రహీమ్ వికెట్‌ను పడగొట్టాడు. తర్వాత రెండు బంతుల్లో కనీసం ఒక పరుగు కూడా రాబట్టలేకపోయిన బంగ్లాదేశ్.. చివరి మూడు బంతుల్లో 2, 1, 1‌తోనే సరిపెట్టడంతో వెస్టిండీస్ ఊపిరి పీల్చుకుంది. విజేత నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.