యాప్నగరం

బంగ్లాదేశ్ చేతిలో వెస్టిండీస్ క్లీన్‌స్వీప్..!

ఢాకా వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో అన్ని విభాగాల్లోనూ సత్తాచాటిన బంగ్లాదేశ్ ఏకంగా ఇన్నింగ్స్ 184 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

Samayam Telugu 2 Dec 2018, 2:39 pm
భారత గడ్డపై టెస్టుల్లో ఇటీవల క్లీన్‌స్వీప్‌‌తో ఢీలాపడిన వెస్టిండీస్ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో నిరాశపరిచిన కరీబియన్ టీమ్‌ని వరుసగా రెండు టెస్టుల్లోనూ చిత్తుగా ఓడించిన ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు 2-0తో టెస్టు సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఢాకా వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో అన్ని విభాగాల్లోనూ సత్తాచాటిన బంగ్లాదేశ్ ఏకంగా ఇన్నింగ్స్ 184 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకోవడం విశేషం.
Samayam Telugu DtU4YrdU0AAmwPC


శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 508 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో మహ్మదుల్లా (136: 242 బంతుల్లో 10x4) శతకంతో మెరవగా.. ఓపెనర్‌ షాదమన్ ఇస్లామ్ (76: 199 బంతుల్లో 6x4), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (80: 139 బంతుల్లో 6x4), లిట్టన్ దాస్ (54: 62 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకాలతో రాణించారు.

అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ జట్టు.. బంగ్లా స్పిన్నర్ మెహిదీ హసన్ (7/58) ధాటికి 36.4 ఓవర్లలోనే 111 పరుగులకి కుప్పకూలిపోయింది. దీంతో.. ఫాలో ఆన్ ఆడిన కరీబియన్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తేలిపోయారు. మరోసారి మెహిదీ హసన్ (5/59) మాయ చేయడంతో ఆ జట్టు 59.2 ఓవర్లలో 213 పరుగులకి చేతులెత్తేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హిట్‌మెయర్ (39, 93) టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. తొలి టెస్టులోనూ 64 పరుగుల తేడాతో గెలుపొందిన బంగ్లాదేశ్ జట్టు.. రానున్న ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ని వెస్టిండీస్‌తో ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.