యాప్నగరం

ఆసియా కప్‌ గెలిచిన బంగ్లా జట్టుకి నజరానా..!

ఆసియా టీ20 కప్ గెలిచిన బంగ్లాదేశ్ మహిళల జట్టుకి ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది. గత ఆదివారం కౌలాలంపూర్ వేదికగా భారత

Samayam Telugu 12 Jun 2018, 4:33 pm
ఆసియా టీ20 కప్ గెలిచిన బంగ్లాదేశ్ మహిళల జట్టుకి ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది. గత ఆదివారం కౌలాలంపూర్ వేదికగా భారత మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి గెలిచిన బంగ్లాదేశ్ జట్టు తొలిసారి ఆసియా కప్‌ని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ఆసియా కప్ జరగగా.. ఆరు సార్లు వరుసగా భారత జట్టు గెలిచింది. కానీ.. ఈ ఏడాది టోర్నీ లీగ్‌ దశలో భారత జట్టుని ఒకసారి ఓడించిన బంగ్లాదేశ్ ఫైనల్లోనూ ఓటమి రుచి చూపి ఆ జైత్రయాత్రకి బ్రేక్‌లేసింది.
Samayam Telugu bangladesh-759


కౌలాలంపూర్ నుంచి బంగ్లాదేశ్ జట్టు తాజాగా స్వదేశానికి రాగా.. 2,36,000 డాలర్ల (భారత కరెన్సీలో రూ. 1.59 కోట్లు) నజరానాని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇందులో ఒక్కో క్రీడాకారిణికి 14,800 డాలర్లు, జట్టు మేనేజ్‌మెంట్, కోచింగ్ సిబ్బందికి కలిపి 75,000 డాలర్లు అందనున్నట్లు బోర్డు తెలిపింది. అంతేకాకుండా.. ప్రస్తుతం మహిళా క్రికెటర్లకి ఉన్న జీతాలు, మ్యాచ్‌ ఫీజులపై కూడా సమీక్ష నిర్వహించి పెంచుతామని బోర్డు హామీ ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.