ధోనీ కీపింగ్ చేస్తుంటే.. బౌలింగ్ నా కల
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ కీపింగ్ చేస్తుంటే.. బౌలింగ్ చేయడం తన కల అని ఇటీవల భారత జట్టుకి
TNN 6 Dec 2017, 4:59 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ కీపింగ్ చేస్తుంటే.. బౌలింగ్ చేయడం తన కల అని ఇటీవల భారత జట్టుకి ఎంపికైన ఫాస్ట్ బౌలర్ బసిల్ థంపి వెల్లడించాడు. శ్రీలంకతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌లో తలపడే జట్టులో థంపీకి భారత సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పేసర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఐపీఎల్ తన కెరీర్‌కి చాలా ఉపయోగపడిందన్నాడు. గుజరాత్ లయన్స్ జట్టు తరఫున ఈ ఏడాది ఐపీఎల్ ఆడిన థంపీ.. చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు.
‘భారత్ జట్టుకి ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నాను. గత ఏడాదికాలంగా నా బౌలింగ్‌లో మెరుగులుదిద్దుకున్నా. కొన్ని సందర్భాల్లో బంతులు గతి తప్పినా.. వేగం మాత్రం తగ్గించుకోవద్దని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మెక్‌గ్రాత్ నాకు సూచించాడు. ధోనీ వికెట్ కీపింగ్ చేస్తుంటే బౌలింగ్ చేయడం నా సుదీర్ఘ కల. అది త్వరలో నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ నా కెరీర్‌ని మలుపుతిప్పింది’ అని థంపీ ఆనందం వ్యక్తం చేశాడు. తొలి టీ20 మ్యాచ్ కటక్ వేదికగా డిసెంబరు 20న జరగనుంది.