యాప్నగరం

బీసీసీఐలో భారీ కుదుపు.. సీఈవో రాహుల్ జోహ్రీ రాజీనామా

Rahul Johri: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సీఈవో రాహుల్ జోహ్రీ రాజీనామా చేశారు. బీసీసీఐలో మరోసారి వైరుద్యాలు బయటపడ్డాయి.

Samayam Telugu 10 Jul 2020, 12:05 am
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో భారీ కుదుపు. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ ఆ పదవికి రాజీనామా చేశారు. బీసీసీఐలో ఓ ఉన్నతాధికారితో వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ ఘటనలో బీసీసీఐలో మరోసారి వైరుధ్యాలు బయటపడ్డాయి. బీసీసీఐలో సుదీర్ఘ వివాదాల అనంతరం ఏర్పాటైన పదవి చివరికి అదే వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Samayam Telugu బీసీసీఐ సీఈవో
Rahul Johri Resign


సుప్రీంకోర్టు నియమించిన లోథా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవిని ఏర్పాటు చేసింది. ఈ ప్రతిష్టాత్మక పదవిని మొట్టమొదటిసారిగా రాహుల్ జోహ్రీ నిర్వహించారు. రాహుల్ జోహ్రీ కొన్ని నెలల కిందటే రాజీనామా లేఖ సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ రాజీనామాను బీసీసీఐ గురువారం (జులై 9) ఆమోదించినట్లు సమాచారం.

Sourav Ganguly


రాహుల్ జోహ్రీ 2016 ఏప్రిల్‌లో బీసీసీఐ సీఈవో పదవి చేపట్టారు. వారం రోజుల్లో ఆయన ఈ పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన రాజీనామాను ఇప్పటివరకు బీసీసీఐ గానీ, జోహ్రీ సహా బీసీసీఐలోని ఏ ఒక్క అధికారి గానీ ధ్రువీకరించలేదు. బీసీసీఐలో చేరడానికి ముందు రాహుల్ జోహ్రీ.. డిస్కవరీ నెట్‌వర్క్స్ ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సౌత్ ఆసియా జనరల్ మేనేజర్‌గా పని చేశారు.

Also Read: నేపాల్‌లో భారత టీవీ ఛానెళ్ల నిలిపివేత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.