యాప్నగరం

ధోనీ భవితవ్యంపై తుది నిర్ణయం అప్పుడే..!

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌పై పెదవి విప్పని మహేంద్రసింగ్ ధోనీ.. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. అదీ.. బీసీసీఐ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే.. దీంతో.. బ్యాట్‌తో సమాధానం చెప్పాలని ఈ మాజీ కెప్టెన్ భావిస్తున్నాడేమో..!

Samayam Telugu 17 Jan 2020, 2:46 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. A+, A, B, C కేటగిరీల్లో మొత్తం 27 మంది భారత క్రికెటర్లకి సెంట్రల్ కాంట్రాక్ట్‌‌లో చోటిచ్చిన బీసీసీఐ.. ధోనీకి మాత్రం మొండిచేయి చూపింది. ధోనీ ఇలా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేకపోవడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Samayam Telugu MS Dhoni IPL 2019


Read More: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఏ క్రికెటర్ ఏ ఏ కేటగిరీలో అంటే..?

టీమిండియా తరఫున 2014, డిసెంబరులో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన మహేంద్రసింగ్ ధోనీ.. 2019, ఫిబ్రవరిలో టీ20, జులైలో వన్డే మ్యాచ్ ఆడాడు. దీంతో.. దాదాపు ఆరు నెలలుగా భారత్ జట్టు తరఫున కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీకి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు బీసీసీఐ నిరాకరించినట్లు తెలుస్తోంది. 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు మధ్యకాలానికి సంబంధించి వార్షిక కాంట్రాక్ట్‌ని బీసీసీఐ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More: ఎంఎస్ ధోనీ కాంట్రాక్టు విషయంలో కొత్త ట్విస్ట్
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడంతో ధోనీ ఇక రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని వార్తలు వస్తుండగా.. ఐపీఎల్ 2020 తర్వాతే కెరీర్‌పై ధోనీ అంతిమ నిర్ణయం తీసుకుంటాడని అతని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. అనూహ్యంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ధోనీ.. ఝార్ఖండ్ టీమ్‌తో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో.. ఇప్పటి నుంచే మాజీ కెప్టెన్ ఐపీఎల్‌కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also: MS Dhoniని పొమ్మనలేక.. పొగబెడుతున్నారా..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.