యాప్నగరం

శ్రీలంక పర్యటన‌కి ముందే కోచ్‌ ఎంపిక

శ్రీలంక పర్యటనకి భారత్ జట్టు వెళ్లేలోపే కోచ్‌ని నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. అత్యుత్తమ కోచ్‌ కోసం

TNN 21 Jun 2017, 8:14 pm
భారత్ జట్టు శ్రీలంక పర్యటనకి వెళ్లేలోపే ప్రధాన కోచ్‌ని బీసీసీఐ నియమిస్తుందని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కోచ్‌గా ఏడాది ఒప్పందం గడువు ముగియడంతో అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా బీసీసీఐ మళ్లీ దరఖాస్తుల కోసం గడువు పెంచడంతో కోచ్ నియామక ప్రక్రియ ఆలస్యమవుతుందా అని ప్రశ్నించగా.. బెస్ట్ కోచ్‌ కోసం వేట సాగుతోందని ఆయన సమాధానమిచ్చారు.
Samayam Telugu bcci to appoint new coach before sri lanka tour
శ్రీలంక పర్యటన‌కి ముందే కోచ్‌ ఎంపిక


‘శ్రీలంక పర్యటనకి భారత్ జట్టు వెళ్లేలోపే కోచ్‌ని నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. అత్యుత్తమ కోచ్‌ కోసం బోర్డు వెతుకుతోంది. ఈ కోచ్ ఎంపికలో కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రమేయం ఉండబోదు. క్రికెల్ సలహా కమిటీ అన్ని విధాల చర్చించి కోచ్‌గా పేర్లను సూచిస్తుంది. తర్వాత బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.

జూన్ 23 నుంచి జులై 9 వరకు వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత్ జట్టు అనంతరం జులై 21 నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకేయులతో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. కోచ్ రేసులో ప్రధానంగా రవిశాస్త్రి, టామ్‌ మూడీ, సెహ్వాగ్ పేర్లు వినిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.