యాప్నగరం

వర్షం వచ్చింది.. అరుదైన రికార్డ్ విరాట్‌ చేజారింది!

రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లి.. అరుదైన రికార్డ్ మిస్సయ్యాడు.

TNN 8 Oct 2017, 11:27 am
రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. బౌలర్లు అతడి నమ్మకాన్ని నిలబెట్టారు. ఆసీస్‌ను కట్టడి చేసి 18.4 ఓవర్లలో 118/8కే పరిమితం చేశారు. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్ చాలా సేపు నిలిచిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌కి 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. విరాట్ కోహ్లి (22 నాటౌట్: 14 బంతుల్లో 3x4), శిఖర్ ధావన్ (15 నాటౌట్: 12 బంతుల్లో 3x4), రోహిత్ శర్మ (11: 7 బంతుల్లో 1x4, 1x6) దూకుడుగా ఆడి 5.3 ఓవర్లలోనే జట్టుకి విజయాన్ని అందించారు.
Samayam Telugu because of rain virat kohli missed the consecutive half centuries record
వర్షం వచ్చింది.. అరుదైన రికార్డ్ విరాట్‌ చేజారింది!


వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించడం భారత్ విజయంపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. కానీ విరాట్ కోహ్లికి మాత్రం అరుదైన ఛాన్స్ చేజారింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీ సాధించి ఉంటే.. ఓ జట్టుపై టీ20ల్లో వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పేవాడు. గత ఐదు టీ20లలో ఆసీస్‌పై ఒకసారి మాత్రమే అవుటయ్యాడు. వరుసగా 90*, 59*, 50, 82*, 22* పరుగులు చేశాడు. ఈ ఐదు టీ20ల్లో అతడి సగటు 303 కావడం గమనార్హం. ఆసీస్‌తో జరిగిన చివరి ఏడు టీ20 మ్యాచ్‌ల్లో భారత్ విజయాలు సాధించడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.