యాప్నగరం

కేరళ ఇప్పుడు ఎంతో సురక్షితం: విరాట్ కోహ్లీ

వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళ మళ్లీ పూర్తిగా కోలుకుందని, ఇప్పుడు పర్యాటకులకు ఎంతో సురక్షితమైన ప్రాంతంగా ఉందని విరాట్ కోహ్లీ అన్నాడు.

Samayam Telugu 31 Oct 2018, 5:12 pm
కేరళలో ఉంటే ఆ ఆనందం అంతా ఇంతా కాదని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కేరళ రావడానికి తానెప్పుడూ ఇష్టపడతానని, ఈ ప్రాంత ఎనర్జీ అంటే ఏంతో ప్రేమని అన్నాడు. వెస్టిండీస్‌తో ఐదో వన్డే ఆడేందుకు జట్టుతో కలిసి కోహ్లీ మంగళవారం తిరువనంతపురం చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు చేరుకున్న కోహ్లీ.. అక్కడి విజిటర్స్ డైరీలో కేరళ గురించి నోట్ రాశాడు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేవుని సొంత దేశం(కేరళ) మళ్లీ పూర్తిగా కోలుకుందని పేర్కొన్నాడు.
Samayam Telugu తిరువనంతపురంలోని హోటల్ వద్ద కోహ్లీకి స్వాగతం


‘కేరళలో ఉంటే ఆ ఆనందమే వేరు. ఇక్కడికి రావడం నాకెంతో ఇష్టం. ఈ ప్రాంత ఎనర్జీని చాలా ఇష్టపడతాను. కేరళ అందం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అందరూ కేరళకు వచ్చి ఈ దేవుని సొంత దేశం అనుభూతిని ఆస్వాదించాలని సూచిస్తున్నాను. కేరళ పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు ఎంతో సురక్షితంగా ఉంది. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఎంతో ఆనందాన్ని పంచుతున్న ఈ అద్భుత ప్రాంతానికి కృతజ్ఞతలు’ అని నోట్‌లో కోహ్లీ రాశాడు.
కోహ్లీ రాసిన ఈ నోట్‌ను కేరళ టూరిజం శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. కేరళపై ఇంత ప్రేమ కురిపించిన విరాట్ కోహ్లీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కేరళ మీకు ఆనందం పంచుతోందని తెలిసి మేం చాలా సంతోషించాం. మా ఆతిథ్యాన్ని ఎంజాయ్ చేయండి. రేపటి మ్యాచ్‌లో విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని సురేంద్రన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read this news in Malayalam

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.