యాప్నగరం

ఇంగ్లాండ్ జట్టులోకి మళ్లీ బెన్‌స్టోక్స్..!

ఇంగ్లాండ్ జట్టులోకి స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ మళ్లీ రానున్నాడు. గత ఏడాది సెప్టెంబరులో బెన్‌స్టోక్స్ అతిగా మద్యం సేవించి

TNN 8 Jan 2018, 3:42 pm
ఇంగ్లాండ్ జట్టులోకి స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ మళ్లీ రానున్నాడు. గత ఏడాది సెప్టెంబరులో బెన్‌స్టోక్స్ అతిగా మద్యం సేవించి నైట్‌క్లబ్ ఎదుట ఓ వ్యక్తిని గాయపర్చి.. కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుండటంతో ఇంగ్లాండ్ జట్టు తరఫున అతడ్ని ఆడించాలా..? వద్దా..? అనే మీమాసంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఉంది. ఆస్ట్రేలియాతో ఈనెలలో జరగనున్న వన్డే సిరీస్‌ కోసం ఇంగ్లాండ్ జట్టులో బెన్‌స్టోక్స్‌కి గత డిసెంబరులో సెలక్టర్లు అవకాశం కల్పించినా.. మళ్లీ అతడ్ని జట్టు నుంచి బోర్డు తప్పించింది.
Samayam Telugu ben stokes named in england t20i squad moeen ali jonny bairstow rested
ఇంగ్లాండ్ జట్టులోకి మళ్లీ బెన్‌స్టోక్స్..!


తాజాగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫిబ్రవరిలో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసం మళ్లీ బెన్‌స్టోక్స్‌‌‌కి సెలక్టర్లు అవకాశం కల్పించారు. సోమవారం ప్రకటించిన ఇంగ్లాండ్ టీ20 జట్టు నుంచి మొయిన్ అలీ, జానీ బారిస్టోకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. స్టోక్స్‌ని ఎంపిక చేసి ఆశ్చర్యపరిచారు. కేసు విచారణ త్వరలో ముగుస్తుందనే
నమ్మకంతో ఈ ఆల్‌రౌండర్‌కి అవకాశం కల్పించినట్లు సెలక్టర్లు వివరించారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 2న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఢీకొట్టనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.