యాప్నగరం

రెండో టెస్ట్‌‌ ముందు.. భారత్‌కు గుడ్ న్యూస్?

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో విజయం వాకిట్లో బోర్లా పడిన భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త.

Samayam Telugu 5 Aug 2018, 9:11 am
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో విజయం వాకిట్లో బోర్లా పడిన భారత జట్టుకు ఊరటనిచ్చే వార్త. గురువారం నుంచి ప్రారంభ కానున్న రెండో టెస్టుకు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. గత ఏడాది సెప్టెంబర్లో బ్రిస్టల్‌లోని ఓ పబ్‌లో ఇద్దరు వ్యక్తులపై స్టోక్స్ పిడి గుద్దులు కురిపించాడు. ఇందుకు సంబంధించిన కేసు బ్రిస్టల్ క్రౌన్ కోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఈ విచారణ వాయిదా పడితేనే అతడు లార్డ్స్ టెస్టులో ఆడే అవకాశం ఉంది.
Samayam Telugu ben stokes1


స్టోక్స్ రెండో టెస్ట్ ఆడలేకపోతే.. అతడి స్థానంలో క్రిస్ వోక్స్‌ను ఆడించాలని ఇంగ్లాండ్ సెలక్టర్లు భావిస్తున్నారు. కానీ గాయంతో బాధపడుతున్న వోక్స్ పూర్తిగా కోలుకోలేదు. మ్యాచ్ సమయానికి అతడు ఫిట్‌గా ఉంటాడని ఇంగ్లాండ్ ఆశిస్తోంది.

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసిన స్టోక్స్.. రహానే, దినేశ్ కార్తీక్‌లను పెవిలియన్ చేర్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. కానీ బౌలింగ్‌లో అదరగొట్టాడు. కోహ్లి, రాహుల్, పాండ్య, షమీ వికెట్లను తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.