యాప్నగరం

బెన్‌స్టోక్స్ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేరా..?

ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ వీధి గొడవకి సంబంధించిన కేసులో పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కోసం ఎదురుచూస్తున్నారు

TNN 5 Oct 2017, 5:16 pm
ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ వీధి గొడవకి సంబంధించిన కేసులో పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కోసం ఎదురుచూస్తున్నారు. గత వారం నైట్‌క్లబ్‌లో అతిగా మద్యం సేవించిన బెన్‌స్టోక్స్.. వెలుపలికి వచ్చి అక్కడ ఒక వ్యక్తి ముఖంపై పిడిగుద్దులు కురిపించిన విషయం తెలిసిందే. ఈ గొడవ కారణంగా ఒక రాత్రంతా జైలులో ఉన్న బెన్‌స్టోక్స్‌ని.. విచారణ అనంతరం పోలీసులు విడిచిపెట్టారు. కానీ.. ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ కొనసాగించేందుకు ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు వ్యక్తుల సాక్షం కావాలని పోలీసులు చెప్తున్నారు.
Samayam Telugu ben stokes street brawl case police await two specific witnesses
బెన్‌స్టోక్స్ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేరా..?


గొడవ ఘటనకి సంబంధించిన వీడియో ఒకటి బహిర్గతం కావడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జట్టు నుంచి బెన్‌స్టోక్స్‌ని తాత్కాలికంగా తప్పించింది. దీంతో అతను వెస్టిండీస్‌తో సిరీస్‌కి మధ్యలోనే దూరమయ్యాడు. కేసు నిరూపణ అయితే కనీసం ఐదేళ్లు శిక్ష పడనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నవంబరు‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కి బెన్‌స్టోక్స్ దూరం కావాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే క్రికెటర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. త్వరలోనే కేసు‌ కొలిక్కి వస్తుందని పోలీసులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.