యాప్నగరం

కుప్పకూలిన లంక.. భారత టార్గెట్ 239

సొంతగడ్డపై చివరి వన్డేలోనూ లంకేయులు చతికిలపడ్డారు. కొలంబో వేదికగా ఆదివారం జరుగుతున్న చివరి వన్డేలో

TNN 3 Sep 2017, 7:13 pm
సొంతగడ్డపై చివరి వన్డేలోనూ లంకేయులు చతికిలపడ్డారు. కొలంబో వేదికగా ఆదివారం జరుగుతున్న చివరి వన్డేలో భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (5/42) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.4 ఓవర్లలో 238 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో లాహిరు తిరుమానె (67: 102 బంతుల్లో 3x4, 1x6), మాథ్యూస్ (55: 98 బంతుల్లో 4x4), కెప్టెన్ ఉపుల్ తరంగ (48: 34 బంతుల్లో 9x4) నిలకడగా ఆడినా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో లంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. భువీతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా రెండు, కుల్దీప్ యాదవ్, చాహల్ చెరో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
Samayam Telugu bhuvneshwar keeps sl to 238 sri lanka vs india 5th odi
కుప్పకూలిన లంక.. భారత టార్గెట్ 239


స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు వన్డేల సస్పెన్షన్‌కి గురై ఈ వన్డేతో పునరాగమనం చేసిన శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ డిక్వెల్లా (2), మునవీర (4) ఆదిలోనే నిరాశపరిచినా.. ఉపుల్ తరంగ దూకుడైన ఆటతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. అయితే జట్టు స్కోరు 60 వద్ద ఈ కెప్టెన్ ఔటవగా.. అనంతరం వచ్చిన మాథ్యూస్‌తో కలిసి తిరుమానె కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కి అబేధ్యంగా 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో శ్రీలంక మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. వీరిద్దరి ఔట్ అనంతరం ఏ దశలోనూ భారత్ బౌలర్ల ధాటికి లంకేయులు నిలవలేకపోయారు. ఒకానొక సమయంలో 185/4తో ఉన్న ఆ జట్టు.. చివరికి 238కే పరిమితమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.