యాప్నగరం

మూడు ఫార్మాట్లలో ఒకే ఒక్కడు.. భువీ ఖాతాలో అరుదైన రికార్డ్

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఐదు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన భువీ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

TNN 18 Feb 2018, 10:14 pm
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. 15 ఓవర్లలో 129/4తో విజయం కోసం పోరాడినట్లు కనిపించిన ఆ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 175/9కే పరిమితమైంది. భారత విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన అతడు.. 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. మొత్తం నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.
Samayam Telugu bhuvneshwar kumar is the first indian to take five wicket hauls in all 3 international formats
మూడు ఫార్మాట్లలో ఒకే ఒక్కడు.. భువీ ఖాతాలో అరుదైన రికార్డ్


తద్వారా భారత్ తరఫున టీ20ల్లో ఐదు వికెట్ల హాల్ సాధించిన తొలి పేస్ బౌలర్‌గా రికార్డ్ నెల్పాడు. మూడు ఫార్మాట్లలో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ భువీ ఘనత సాధించాడు. భారత్ తరఫున టీ20ల్లో ఐదు వికెట్ల హాల్ సాధించిన రెండో బౌలర్ భువీ. గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో చాహల్ ఆరు వికెట్లు తీశాడు. చిన్నస్వామి స్టేడియంలో 4 ఓవర్లు వేసిన చాహల్ 25 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.