యాప్నగరం

సఫారీ పిచ్‌లపై భువనేశ్వర్‌ ప్రమాదకారి

దక్షిణాఫ్రికా గడ్డపై భారత బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఫాస్ట్ బౌలర్‌ భువనేశ్వర్ కుమార్ ఉందని మాజీ బౌలర్ జవగళ్

TNN 3 Jan 2018, 5:51 pm
దక్షిణాఫ్రికా గడ్డపై భారత బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఫాస్ట్ బౌలర్‌ భువనేశ్వర్ కుమార్ ఉందని మాజీ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం నుంచి కేప్‌ టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో సిరీస్ తీరుపై మీడియాతో శ్రీనాథ్ బుధవారం మాట్లాడారు. సఫారీతో టెస్టు సిరీస్‌ కోసం మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ , ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య తదితర ఫాస్ట్ బౌలర్లని జట్టులోకి భారత సెలక్టర్లు ఎంపిక చేశారు.
Samayam Telugu bhuvneshwar kumar should be indias strike bowler in south africa believes javagal srinath
సఫారీ పిచ్‌లపై భువనేశ్వర్‌ ప్రమాదకారి


‘భువనేశ్వర్ కుమార్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. దానికి పిచ్‌ నుంచి కొంచెం పేస్ లభిస్తే చాలు.. అతను అలవోకగా వికెట్లు పడగొట్టగలడు. భారత్ జట్టుకి అతను పెద్ద ఆస్తి.. ముఖ్యంగా దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లపై అతను మరింత ప్రమాదకారి. గత ఏడాదన్నర కాలంగా భువీ చాలా మెరుగయ్యాడు. ఈ సఫారీ పర్యటనలో అతనే భారత జట్టుని ముందుండి నడిపిస్తాడని నా నమ్మకం’ అని శ్రీనాథ్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.