యాప్నగరం

Big Bash League 2019: ఏం సిక్స్ గురూ..? మాక్స్‌వెల్‌కి మాత్రమే సాధ్యం..!

మాక్స్‌వెల్‌ ఫామ్‌లోకి వస్తే ఎలా ఉంటుందో..? మరోసారి నిరూపితమైంది. బౌలర్ ఎలాంటి బంతి వేసినా.. ఆఖరిగా వైడ్‌గా వేసినా కూడా ఈ స్టార్ ఆల్‌రౌండర్ బౌండరీ లైన్ వెలుపలికి హిట్ చేసేస్తున్నాడు.

Samayam Telugu 28 Dec 2019, 12:10 pm
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మరోసారి తన పవర్ హిట్టింగ్‌తో అభిమానుల్ని అలరించాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఇటీవల 39 బంతుల్లోనే 83 పరుగులు చేసిన మాక్స్‌వెల్.. తాజాగా అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. మెల్‌బోర్న్ స్టార్స్ టీమ్‌కి ఆడుతున్న మాక్స్‌వెల్ కేవలం 25 బంతుల్లోనే 1x4, 4x6 సాయంతో 43 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను కొట్టిన సిక్సర్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
Samayam Telugu Glenn Maxwell


అడిలైడ్ స్ట్రైకర్స్ ఫాస్ట్ బౌలర్ అగర్.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వైడ్ రూపంలో విసిరిన బంతిని మోకాలిపై కూర్చుని మాక్స్‌వెల్ హిట్ చేశాడు. బ్యాట్‌కి బంతిని చక్కగా మిడిల్ చేయడంతో అది డీప్ పాయింట్ దిశగా వెళ్లి బౌండరీ లైన్ వెలుపల పడింది. మ్యాచ్ కామెంటేటర్ మాటల్లో చెప్పాలంటే.. ఈ తరహా షాట్‌ని కేవలం మాక్స్‌వెల్ మాత్రమే ఆడగలడు.


కోల్‌కతా వేదికగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలానికి రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన మాక్స్‌వెల్‌ని పోటీపడి మరీ రూ. 10.75 కోట్లకి కింగ్స్ ఎలెవన్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మెంటల్ హెల్త్ బ్రేక్ పేరిట గత అక్టోబరు నుంచి క్రికెట్‌కి దూరంగా ఉన్న మాక్స్‌వెల్.. మళ్లీ బిగ్‌బాష్ లీగ్‌తో రీఎంట్రీ ఇచ్చి హిట్టింగ్‌తో అదరగొట్టేస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.