యాప్నగరం

ఐపీఎల్: దిల్లీ డేర్‌డెవిల్స్‌కి గట్టి ఎదురుదెబ్బ

పదో సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాను. కానీ వ్యక్తిగత కారణాలతో తీసుకోక తప్పడం లేదు. నా ఇబ్బందిని అర్థం చేసుకుని

TNN 21 Mar 2017, 1:58 am
ఐపీఎల్ పదో సీజన్ ఆరంభానికి ముందే ఆటగాళ్ల వికెట్లు పడటం మొదలైపోయింది. గాయం కారణంగా రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా) ఇటీవల సీజన్‌ నుంచి తప్పుకోగా.. తాజాగా దిల్లీ డేర్‌డెవిల్స్ ఆల్‌రౌండర్ జేపీ డుమిని (దక్షిణాఫ్రికా) వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. 2015 సీజన్‌లో దిల్లీ జట్టును నడిపించిన డుమిని.. 2016లో జహీర్‌ఖాన్ కెప్టెన్సీలో ఆడాడు. మిడిలార్డర్‌లో డుమిని నమ్మదగిన బ్యాట్స్‌మెన్.. అదే విధంగా జట్టుకు ఉపయుక్తమైన బౌలర్‌ కావడంతో ఈ ఏడాది అతని ప్రదర్శనపై దిల్లీ ఆశలు పెట్టుకుంది.
Samayam Telugu big blow for delhi daredevils as jp duminy pulls out
ఐపీఎల్: దిల్లీ డేర్‌డెవిల్స్‌కి గట్టి ఎదురుదెబ్బ


‘ఐపీఎల్‌ పదో సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాను. కానీ వ్యక్తిగత కారణాలతో సీజన్‌ నుంచి తప్పుకోక తప్పడం లేదు. నా ఇబ్బందిని అర్థం చేసుకుని సహకరించినందుకు దిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీకి ధన్యవాదాలు. ఇప్పటి వరకు ప్రతిభావంతులైన క్రికెటర్లతో కలిసి ఆడినందుకు చాలా గర్వంగా ఉంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో మళ్లీ దిల్లీ జట్టుతో కలుస్తానని ఆశిస్తున్నా’ అని డుమిని వివరించాడు. మరోవైపు దిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ డుమిని నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేసినా.. సానుకూలంగానే స్పందించింది. ‘డుమిని నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. అయితే సీజన్ ఆరంభానికి కొద్ది రోజుల ముందు అతను ఈ నిర్ణయం తీసుకోవడం మమ్మల్ని నిరాశపరిచింది. కానీ అతని పరిస్థితిని మేము అర్థం చేసుకున్నాం. త్వరలోనే అతని స్థానాన్ని మరో క్రికెటర్‌తో భర్తీ చేస్తాం’ అని ఫ్రాంఛైజీ వివరించింది. ఏప్రిల్ 5 నుంచి ఐపీఎల్ 2017 సీజన్ ఆరంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.