యాప్నగరం

IPL: అత్యధిక ‘ధర’ ఆటగాళ్లు రిలీజ్..!

2018 ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన మనీశ్ పాండే చేసిన పరుగులు 284 మాత్రమే. దీంతో.. అతను కొన్ని మ్యాచ్‌ల్లో కనీసం తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

Samayam Telugu 16 Nov 2018, 11:10 am
ఐపీఎల్ 2018 సీజన్ వేలంలో రూ.10కోట్లకి పైగాపోసి కొనుగోలు చేసిన ఆటగాళ్ల‌ని వదులుకునేందుకు తాజాగా ఫ్రాంఛైజీలు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ‌లు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. రూ.కోట్లు పోసి స్టార్ ఆటగాళ్లని కొనుగోలు చేసినా.. వారు ఆశించిన మేర రాణించకపోవడంతో గుర్రుగా ఉన్న ఫ్రాంఛైజీలు.. వచ్చే ఏడాది వారిని కొనసాగించేందుకు ఇష్టపడలేదు.
Samayam Telugu Manish-Pandey-of-Sunrisers-Hyderabad-bowled-out-by-Kings-XI-Punjab-by-Ankit-Rajpoot


2018 ఐపీఎల్ సీజన్‌కి ముందు బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ అత్యధిక ధరకి ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (రూ. 12.5 కోట్లు), భారత యువ ఫాస్ట్ బౌలర్ జయదేశ్ ఉనద్కత్ (రూ.11.5 కోట్లు)‌లను కొనుగోలు చేసింది. అలానే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. ఏకంగా రూ. 11 కోట్లు వెచ్చించి మరీ మనీశ్ పాండేని తీసుకుంది. కానీ.. ఐపీఎల్ 2018 సీజన్‌లో ఈ ముగ్గురూ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో.. వీరిని విడిచిపెట్టాలని తొలుత ఫ్రాంఛైజీలు ఆలోచించాయి. కానీ.. మనీశ్ పాండే‌‌కి హైదరాబాద్ ఫ్రాంఛైజీ మరో అవకాశం ఇవ్వగా.. బెన్‌స్టోక్స్‌ని కొనసాగించిన రాజస్థాన్... ఉనద్కత్‌ని మాత్రం వేలంలోకి రిలీజ్ చేసింది.

2018 ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన మనీశ్ పాండే చేసిన పరుగులు 284 మాత్రమే. దీంతో.. అతను కొన్ని మ్యాచ్‌ల్లో కనీసం తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక ఆల్‌‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ది కూడా ఇదే బాట. అతను సీజన్ మొత్తం 196 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. భారీ అంచనాల మధ్య ఊహించని ధరకి అమ్ముడుపోయిన జయదేశ్ ఉన్కదత్.. టోర్నీలో నిరాశపరిచి 11 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం డిసెంబరులో జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఈనెల 15లోపు ఫ్రాంఛైజీలు తాము వద్దనుకుంటున్న ఆటగాళ్ల జాబితాని విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. దీంతో.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ యువరాజ్ సింగ్‌, అరోన్ ఫించ్‌‌ని.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ గౌతమ్ గంభీర్‌, మహ్మద్ షమీని.. సన్‌రైజర్స్ హైదరాబాద్ వృద్ధిమాన్‌ సాహా‌, బ్రాత్‌వైట్‌ని.. ముంబయి ఇండియన్స్ ముస్తాఫిజుర్, డుమినీని... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెక్‌కలమ్, క్రిస్‌వోక్స్‌ని.. ఇలా అగ్రశ్రేణి ఆటగాళ్లను సైతం ఫ్రాంఛైజీలు వేలంలోకి విడిచిపెట్టాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.