యాప్నగరం

IND vs AUS: భయపెడుతున్న కరోనా.. అడిలైడ్‌లో తొలి టెస్టు అనుమానమే!

Cricket Australia భరోసా ఇచ్చినా సరే అడిలైడ్ వేదికగా తొలి టెస్టు కచ్చితంగా జరుగుతుందని చెప్పలేని పరిస్థితి. దీంతో ప్రత్యామ్నాయ వేదికలను సైతం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Samayam Telugu 18 Nov 2020, 3:39 pm
కరోనా కేసులు వెలుగు చూస్తున్నా.. అడిలైడ్ వేదికగా తొలి టెస్టు జరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా భరోసా ఇచ్చింది. కానీ డిసెంబర్ 17న అడిలైడ్‌లో తొలి టెస్టు జరగడం అనుమానంగా ఉంది. దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ స్టీవెన్ మార్షల్.. తొలి టెస్టును అడిలైడ్‌లో నిర్వహించే విషయమై గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంటోంది.
Samayam Telugu Adelaide Oval
A general view of a day-night Test at Adelaide Oval in Adelaide. (Getty Images)


‘తొలి టెస్టు అడిలైడ్‌లో జరుగుతుందనే ఆశతోనే ఉన్నాం. ‘దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా బారిన పడిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన వారిని, వైరస్ సోకే ముప్పు ఉన్న వారిని సాధ్యమైనంత త్వరగా క్వారంటైన్లో ఉంచుతున్నాం’ అని మార్షల్ తెలిపారు. ఒకవేళ అడిలైడ్‌లో తొలి టెస్టు ఆడే పరిస్థితులు లేకపోతే.. రెండో టెస్టు ఆడే మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ప్రత్యామ్నాయ వేదికగా ఉంచనున్నారు. చివరి నిమిషంలో వేదికను మార్చాల్సి వస్తే.. ఆతిథ్యం ఇవ్వడానికి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌‌ను సైతం సిద్ధంగా ఉంచనున్నారు.

వన్డే, టీ20 సిరీస్‌ల్లో ఆడే ఆటగాళ్లు, స్టాఫ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా, టస్మానియా, క్వీన్స్‌లాండ్ నుంచి సిడ్నీ తరలించింది. కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్న దక్షిణ ఆస్ట్రేలియాతో ఈ మూడు రాష్ట్రాలు సరిహద్దులను మూసేశాయి.

షీఫెల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడుతున్న దేశవాళీ క్రికెటర్లెవరూ గతవారం అడిలైడ్‌లోని కరోనా హాట్‌స్పాట్‌కు వెళ్లలేదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆటగాళ్లందరూ కోవిడ్ టెస్టులు చేసుకోవాలని బోర్డు ఆదేశించింది. ఇప్పటి వరకూ అందరికీ నెగటివ్ అనే రిపోర్టులు వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.