అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ బహిరంగంగానే ఎన్నోసార్లు తాను మహేంద్రసింగ్ ధోనీకి వీరాభిమానినంటూ చెప్పుకొచ్చాడు. తన ఆరాధ్య క్రికెటర్ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడటం జీవితంలో అత్యంత మధుర క్షణమని గతంలో వెల్లడించిన ఈ అఫ్గానిస్థాన్ హిట్టర్.. ధోనీ తరహాలో అప్పుడప్పుడు హెలికాప్టర్ షాట్ ఆడటమే కాకుండా వికెట్ కీపింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. రంజాన్ మాసంలో ఓసారి ధోనీ బ్యాటింగ్ చూసేందుకు తనకెంతో ఇష్టమైన భోజనాన్ని సైతం త్యాగం చేసినట్లు గతంలో చెప్పిన షెహజాద్.. అతడి బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌ని చూసి తన ఆటకి మెరుగులు దిద్దుకున్నట్లు వెల్లడించాడు. తాజాగా ధోనీని తలపిస్తూ హెహజాద్ చేసిన రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో చిట్టగాంగ్ వికింగ్స్తో తరఫున ఆడుతున్న షెహజాద్ కనీసం వికెట్లవైపు చూడకుండా ఢాకా డైనమెట్స్ ఓపెనర్ రెహ్మాన్‌ని రనౌట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. స్పిన్నర్ హసన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ ఆడబోయిన రెహ్మాన్ బంతిని ఆశించిన విధంగా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో.. ఎడ్జ్ తాకిన బంతి క్రీజుకి సమీపంలో నిలవగా.. పరుగు కోసం ప్రయత్నించిన రెహ్మన్ ఆ తర్వాత నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాట్స్‌మెన్ వారించడంతో మళ్లీ వెనక్కివెళ్లాడు. కానీ.. అప్పటికే బంతిని అందుకున్న షెహజాద్ కనీసం వికెట్ల వైపు చూడకుండా బాల్ని వెనక్కి విసిరి రనౌట్ చేశాడు. గతంలో మహేంద్రసింగ్ ధోనీ ఈ తరహా రనౌట్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.