యాప్నగరం

ప్రధాన కోచ్ రేసులో మిగిలింది ఆరుగురే..!

దివారం చివరి రోజు కాగా.. 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హత, అనుభవం ఆధారంగా దరఖాస్తుల్ని

TNN 9 Jul 2017, 5:30 pm
భారత్ జట్టు ప్రధాన కోచ్ రేసులో చివరికి ఆరుగురు అభ్యర్థులే మిగిలారు. దరఖాస్తు గడువుకి ఆదివారం చివరి రోజు కాగా.. 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హత, అనుభవం ఆధారంగా దరఖాస్తుల్ని క్రమబద్ధీకరిస్తే చివరికి ఆరు మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కోచ్‌గా ఏడాది ఒప్పందం గడువు ముగియడంతో అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu cac set to interview six candidates including ravi shastri virender sehwag for india head coach job
ప్రధాన కోచ్ రేసులో మిగిలింది ఆరుగురే..!


క్రికెట్ సలహా కమిటీ సభ్యులైన సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ అభ్యర్థులకి సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, సిమన్స్, పైబ్స్, రాజ్‌పుత్ మాత్రమే తుది రేసులో నిలిచారు. కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు, బీసీసీఐ కూడా రవిశాస్త్రికే కోచ్ పదవి ఇవ్వాలని యోచిస్తుండటంతో అతని ఎంపిక లాంఛనం కానుంది. భారత్ జట్టు ఈ నెల చివర్లో శ్రీలంక పర్యటనకి వెళ్లేలోపు కోచ్‌ని ఎంపిక చేస్తామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.