యాప్నగరం

బంగ్లాదేశ్‌ను పసికూనలా చూడట్లేదు: కోహ్లి

బంగ్లాదేశ్‌ను పసికూనలా చూడట్లేదు.. గత కొంత కాలంగా ఆ జట్టు చాలా మెరుగ్గా ఆడుతోందని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు.

TNN 8 Feb 2017, 1:31 pm
బంగ్లాదేశ్‌ను పసికూనలా చూడట్లేదు.. గత కొంత కాలంగా ఆ జట్టు చాలా మెరుగ్గా ఆడుతోందని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. గురువారం నుంచి హైదరాబాద్లో బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో కోహ్లి బుధవారం మీడియాతో మాట్లాడాడు. బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడం లేదు.. ప్రధాన జట్లతో ఆడినట్లే.. వారిపైనా అన్ని వ్యూహాలతో బరిలోకి దిగబోతున్నామని వివరించాడు. ఇక జట్టులో నెలకొన్న పోటీ ఒక రకంగా అదృష్టమని కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కరుణ్ నాయర్ తానేంటో నిరూపించుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో చాహల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి వారిని గుర్తించి జట్టుకి ఎంపిక చేసిన సెలక్టర్లదే ఆ గొప్పతనమంతా అంటూ.. కోహ్లి సెలక్టర్లపై ప్రశంసలు కురిపించాడు.
Samayam Telugu cant take bangaldesh team lightly virat kohli
బంగ్లాదేశ్‌ను పసికూనలా చూడట్లేదు: కోహ్లి


We cannot take any aspect of Bangladesh lightly, says #TeamIndia Captain @imVkohli on the eve of the one-off Test #INDvBAN pic.twitter.com/4Nl9YOP68d— BCCI (@BCCI) February 8, 2017
టెస్టు మ్యాచ్‌లో కేవలం ఒక సెషన్లోనే ఆట స్వరూపం మారిపో‌యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతాం అని కోహ్లి స్పష్టం చేశాడు. యువ బౌలర్ కుల్దీప్ ప్రతిభావంతుడు.. స్వదేశంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నామన్నాడు. మిశ్రా గాయపడటంతో అతడి స్థానంలో కుల్దీప్ తుది జట్టులో ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. టెస్టు హోదా పొందిన తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి భారత్‌లో టెస్టు మ్యాచ్ ఆడుతుండటంపై విరాట్ మాట్లాడుతూ.. అది వారి అదృష్టం.. ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.