యాప్నగరం

​ నా క్రికెట్ కెరీర్‌లోనే ఇదో చెత్త సిరీస్..!

సందేహం లేకుండా నా కెరీర్‌లో ఇదో కఠినమైన, చెత్త సిరీస్. మేము కనీసం ఆటను ఐదో రోజు వరకు కూడా తీసుకెళ్లలేకపోయాం.

TNN 14 Aug 2017, 8:00 pm
భారత్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్ చేజార్చుకోవడం.. మూడో టెస్టులో జట్టు ప్రదర్శన మరీ తీసికట్టుగా మారడంతో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన టెస్టు కెరీర్‌లో ఇదో చెత్త సిరీస్‌గా అభివర్ణించిన చండిమాల్.. ఓటములకి తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఆటలో మూడో రోజైన సోమవారం ముగిసిన పల్లెకలె టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 171 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Samayam Telugu chandimal calls india series worst of his career
​ నా క్రికెట్ కెరీర్‌లోనే ఇదో చెత్త సిరీస్..!


‘సందేహం లేకుండా నా కెరీర్‌లో ఇదో కఠినమైన, చెత్త సిరీస్. మేము కనీసం ఆటను ఐదో రోజు వరకు కూడా తీసుకెళ్లలేకపోయాం. సిరీస్‌లో ఒకటి నాలుగు రోజుల్లో.. ఒకటి మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ ఓటమిని జీర్ణించుకోవడం జట్టులోని ఆటగాళ్లకి కూడా కష్టమే. క్రిడెట్ అంతా భారత్ జట్టుకే చెందుతుంది. ఒక కెప్టెన్‌గా ఈ ఓటములకి నేనే బాధ్యత తీసుకుంటున్నాను. అభిమానులు సిరీస్ మొదటి నుంచి మాకు మద్దతు తెలుపుతున్నారు. చివరికి ఈ రోజు ఘోర పరాజయం సమయంలోనూ మాకు అండగా నిలిచారు. ప్రస్తుతం వారి మద్దతు జట్టు చాలా అవసరం’ అని చండిమాల్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.