యాప్నగరం

రిషబ్ పంత్ ఓ విధ్వంసక హిట్టర్: కోచ్

రిషబ్ పంత్ అలవోకగా సిక్సర్లు బాదగలడు. కానీ.. ప్రతి బంతినీ హిట్టింగ్ చేయాలనే తాపత్రయంలో పేలవంగా వికెట్ చేజార్చుకోవడం అతని బలహీనత. పంత్ షాట్ సెలక్షన్‌లోనూ తప్పులు ఉన్నాయని మాజీ క్రికెటర్లు తరచూ చెప్తుంటారు.

Samayam Telugu 14 Dec 2019, 7:18 pm
భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భవిష్యత్‌లో ఓ విధ్వంసక హిట్టర్‌ కాగలడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో కనీసం ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిర రిషబ్ పంత్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అతను వరుసగా విఫలమవుతున్నా ఎందుకు టీమిండియా మేనేజ్‌మెంట్, సెలక్టర్లు మళ్లీ మళ్లీ అవకాశాలిస్తున్నారు..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కానీ.. రిషబ్ పంత్‌కి తాము మద్దతుగా నిలుస్తున్నట్లు కోచ్ రాథోడ్ వెల్లడించాడు.
Samayam Telugu Bengaluru: Indian batting coach Vikram Rathour and cricketer Rishabh Pant during...


IND vs WI 1st ODI: చెపాక్ వన్డేకి భారత్ తుది జట్టు ఇదే..?

భారత్, వెస్టిండీస్ మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం నుంచి తొలి వన్డే జరగనుండగా.. శనివారం రాత్రి మీడియాతో బ్యాటింగ్ కోచ్ రాథోడ్ మాట్లాడాడు. ఆ సమయంలో రిషబ్ పంత్‌ వైఫల్యాల గురించి అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానమిచ్చాడు. ‘రిషబ్ పంత్ గురించి ఎందుకు ఇంతలా చర్చ జరుగుతోందంటే అతను ప్రత్యేక సామర్థ్యమున్న క్రికెటర్. టీమిండియాలోనే కాదు.. ఏ జట్టులో ఉన్నా.. రిషబ్ పంత్ విధ్వంసకరంగా ఆడగలడు. అందుకే సెలక్టర్లతో పాటు టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా అతనికి మద్దతుగా నిలుస్తోంది. ఒక్కసారి అతను ఫామ్ అందుకోగలిగితే విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడగలడు’ అని వెల్లడించాడు.

కోహ్లీ నా తమ్ముడు అందుకే ఆ రియాక్షన్: డివిలియర్స్

బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో రెండో వికెట్ కీపర్‌గా సంజు శాంసన్ ఉన్నా.. అతనికి కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ ఆడే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు పంత్ ఫెయిలవుతున్నా.. అతడ్నే కొనసాగించింది. వెస్టిండీస్‌తో వన్డేలకి ఎంపిక చేసిన జట్టులో అయితే.. రెండో వికెట్ అనే మాటే లేకుండా.. కీపర్‌గా పంత్‌కి సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.

టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీ పక్కా: బ్రావో క్లారిటీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.