టీమిండియా క్రికెటర్, ఆంధ్రా బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు బర్త్ డే నేడు (సెప్టెంబర్ 23). ఈ సందర్భంగా.. అతడు గత ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ అదిరేలా బర్త్ డే విషెస్ చెప్పింది. సీఎస్కే క్రికెటర్లు డ్యాన్స్ చేస్తూ పాట పాడుతున్న వీడియోను సూపర్ కింగ్స్ ట్వీట్ చేసింది. డు డు డు డుడుడు అంబటి రాయుడు అని సహచర క్రికెటర్లు పాట పాడుతున్న వీడియోతోపాటు.. ఈ బర్త్ డే బాహుబలికి ప్రత్యేకంగా ఉండాలని చెన్నై ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది.
సూపర్ బర్త్ డే బాహుబలి అంటూ అంతకు ముందే మరో ట్వీట్‌తో చెన్నై సూపర్ కింగ్స్ అంబటి రాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఐపీఎల్ 2018లో 602 పరుగులు చేసిన రాయుణ్ని ఫ్రాంచైజీ సింహంతో పోల్చింది.
హ్యపీ బర్త్ డే, ఈ ఏడాది నీకు అద్భుతంగా గడవాలంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా రాయుడికి విషెస్ తెలిపాడు. ఐపీఎల్ కప్‌తో రాయుడితో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు. 2018 సీజన్లో చెన్నై ఫ్రాంచైజీకి మారడానికి ముందు రాయుడు ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అతడికి సచిన్‌తో చక్కటి అనుబంధం ఏర్పడింది.
హర్భజన్ సింగ్ కూడా రాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు. రాయుడికి బీసీసీఐ బర్త్ డే విషెస్ చెప్పింది.
సూపర్ బర్త్ డే బాహుబలి అంటూ అంతకు ముందే మరో ట్వీట్‌తో చెన్నై సూపర్ కింగ్స్ అంబటి రాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఐపీఎల్ 2018లో 602 పరుగులు చేసిన రాయుణ్ని ఫ్రాంచైజీ సింహంతో పోల్చింది.