యాప్నగరం

పుజారా.. ఐదు రోజులూ బ్యాటింగ్ చేశావా బాసూ..!

కోల్‌కతా టెస్టులో వర్షం కారణంగా పుజారా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. వరుసగా ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన క్రికెటర్ల జాబితాలో..

TNN 20 Nov 2017, 2:04 pm
కోల్‌కతా టెస్టులో టీమిండియా క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌లో ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. తొలి రోజు వర్షం కారణంగా 11.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన సంగతి తెలిసిందే. ఆ రోజు భారత్ మూడు వికెట్లు కోల్పోగా.. పుజారా క్రీజులో నిలిచాడు. రెండో రోజూ వర్షం ప్రభావం చూపింది. దీంతో భారత్ 5 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. రెండో రోజూ నాటౌట్‌గా నిలిచిన పుజారా.. మూడో రోజు అర్ధ సెంచరీ పూర్తయ్యక పెవిలియన్ చేరాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులైనా చేయగలిగిందంటే.. పుజారా ఇన్నింగ్సే కారణం.
Samayam Telugu cheteshwar pujara batted on all 5 days of a test match
పుజారా.. ఐదు రోజులూ బ్యాటింగ్ చేశావా బాసూ..!


మూడో రోజే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక.. నాలుగో రోజు 352 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీటుగా బదులిచ్చిన భారత ఓపెనర్లు తొలి వికెట్‌కు 166 పరుగులు జోడించారు. 94 రన్స్ చేసిన ధావన్ అవుట్ కావడంతో చివరి సెషన్లో పుజారా క్రీజులోకి వచ్చాడు. టీమిండియా వికెట్ నష్టానికి 177 పరుగులతో నాలుగో రోజు ముగించింది. చివరి రోజు కూడా బ్యాటింగ్ చేసిన పుజారా 22 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో వరుసగా ఐదు రోజులూ బ్యాటింగ్ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రవిశాస్త్రి, హైదరాబాదీ మాజీ క్రికెటర్ ఎంఎల్ జయసింహ సరసన చేరాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.