యాప్నగరం

Chetan Sharma | భారత క్రికెట్‌ను ఐదుగురం శాసిస్తున్నాం.. స్టింగ్ ఆపరేషన్లో దొరికిన చీఫ్ సెలక్టర్!

Chetan Sharma Sting Operation లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. భారత్ జట్టులో ఏం జరుగుతోంది? ప్లేయర్లు, బోర్డు మధ్య గొడవేంటి? గత ఏడాది విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య ఏం జరిగింది? ఇలా చాలా విషయాల్ని చేతన్ శర్మ బయటపెట్టాడు. అంతేకాదు భారత క్రికెటర్లు ఫిట్‌నెస్ సాధించేందుకు ఇంజెక్షన్స్ వేసుకుంటున్నట్లు కూాడా చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రాబోవు రోజుల్లో టీ20 జట్టు ఎలా ఉంటుందో కూడా...?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 15 Feb 2023, 7:57 am

ప్రధానాంశాలు:

  • స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన భారత చీఫ్ సెలెక్టర్
  • టీమిండియా రహస్యాలు బట్టబయలు
  • కోహ్లి, గంగూలీ మధ్య గొడవ విషయం కూడా
  • కోహ్లీ అంటే గంగూలీ ఇష్టంలేదట
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chetan Sharma Sting Operation,
భారత్ జట్టు, చేతన్ శర్మ
Chief Selector Chetan Sharma Sting Operation : భారత క్రికెట్ జట్టులో జరుగుతున్న విషయాల గురించి సంచలన విషయాల్ని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma ) ఓ ప్రముఖ మీడియా ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పేశారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య చెలరేగిన వివాదం, భారత ఆటగాళ్లు మ్యాచ్‌కి ముందు ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్స్ తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించాడు. ఇప్పుడు చేతన శర్మ మాటలు భారత క్రికెట్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి.
భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ గురించి చేతన్ శర్మ ఆ స్టింగ్ ఆపరేషన్‌లో ఏం చెప్పాడంటే? ‘‘భారత క్రికెటర్లు 80% ఫిట్‌గా ఉన్న వాళ్లు ఇంజెక్షన్ తీసుకుని 100% ఫిట్‌‌నెస్‌ సాధిస్తున్నారు’’ అని వెల్లడించాడు. బుమ్రా కనీసం కిందకి వంగలేని పరిస్థితులో ఉన్నాడని.. అలాంటి బుమ్రాని ఇంజెక్షన్ ద్వారా ఫిట్‌నెస్ నిరూపించి ఆడించినట్లు చేతన్ శర్మ బాంబ్ పేల్చాడు. అలానే మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ప్రైవేట్‌గా ఇంజెక్షన్లు తీసుకుని ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఆ ఇంజెక్షన్స్ పెయిన్ కిల్లర్స్ కాదని.. ఒకవేళ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకుంటే డోపింగ్ టెస్టులో దొరికిపోతారని చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ వివాదం గురించి మాట్లాడుతూ ‘‘సౌరవ్ గంగూలీ కారణంగానే విరాట్ కోహ్లీ తాను కెప్టెన్సీ కోల్పోయినట్లు భావిస్తున్నాడు. కానీ ఆరోజు సెలక్షన్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌లో దాదాపు 9 మంది ఉన్నాం. గంగూలీ ఆ మీట్‌లో కోహ్లీతో కెప్టెన్సీ వదిలేయడంపై ‘మరోసారి ఆలోచించు’అని చెప్పాడు. బహుశా.. కోహ్లీ ఆ మాటలు వినలేదేమో? కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కోహ్లీ పరోక్షంగా గంగూలీని టార్గెట్‌గా చేసుకుని మాట్లాడాడు. తనకి చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తప్పించారని ఆరోపించాడు. దాంతో కోహ్లీ అబద్ధం చెప్తున్నాడని గంగూలీ చెప్పాడు. కానీ కోహ్లీ ఎందుకు అబద్ధం చెప్తాడు? అని అందరూ అనుకున్నారు. అక్కడ మొదలైంది బోర్డు vs ప్లేయర్ల గొడవ’’ అని చేతన్ శర్మ వెల్లడించాడు. ఓవరాల్‌గా ఐదుగురు భారత క్రికెట్‌ని శాసిస్తున్నట్లు శాసిస్తున్నట్లు చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు.

‘‘రోహిత్ శర్మకి సౌరవ్ గంగూలీ అనుకూలం ఏమీ కాదు.. కానీ విరాట్ అంటే మాత్రం అతనికి నచ్చదు. రోహిత్ శర్మ ఇకపై టీ20 జట్టులో ఎక్కువ కాలం కొనసాగడు. అతనితో పాటు విరాట్ కోహ్లి కూడా కష్టమే. హార్దిక్ పాండ్యకి కెప్టెన్సీ ఇచ్చి.. శుభమన్ గిల్‌కి అవకాశాలిస్తాం’’ అని చేతన్ శర్మ వెల్లడించాడు. భారత్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది.

Read Latest Sports News, Cricket News, Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.