యాప్నగరం

45 ఏళ్ల దాకా క్రికెట్ ఆడతా.. రిటైర్మెంట్ ప్రకటించను.. టీ20 వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగుతానేమో..!

మరో ఐదేళ్లపాటు క్రికెట్‌లో కొనసాగుతానని యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనే లేదని, వీలైతే టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతానని పేర్కొన్నాడు.

Samayam Telugu 9 Jan 2020, 9:03 pm
మరో ఐదేళ్లపాటు అంతర్జాతీయ లీగ్‌ల్లో ఆడతానని యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ తాజాగా ప్రకటించాడు. ఇప్పటికే 40 ఏళ్ల వయసు పూర్తి చేసుకున్న యూనివర్స్ బాస్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనేదీ లేదని ప్రకటించాడు. మరోవైపు సొంతదేశం వెస్టిండీస్ తరపున టీ20 వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగే అవకాశముందని తెలిపాడు. గత సెప్టెంబర్‌లో చివరగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన గేల్..అప్పటి నుంచి సొంతజట్టుకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు.
Samayam Telugu Chris Gayle


Read Also : మరో వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ
తాజాగా మీడియాతో మాట్లాడిన గేల్.. మరో ఐదేళ్ల వరకు క్రికెట్ ఆడతానని వెల్లడించాడు. ‘ నేను క్రికెట్ ఆడాలని చాలామంది కోరుకుంటున్నారు. గేమ్‌పై ఆట, కోరిక నాలో అలాగే ఉన్నాయి. టీ20లతోపాటు విదేశీ లీగ్‌ల్లో సాధ్యమైనంత కాలం వీటిని కొనసాగించాలనుకుంటున్నా. వచ్చే అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగే అవకాశాల్ని తోసిపుచ్చలేం’ అంటూ గేల్ వ్యాఖ్యానించాడు.

Read Also : బౌండరీలైన్ వద్ద క్యాచులాట.. ట్విస్ట్ ఇచ్చిన అంపైర్ (వీడియో)
‘ ప్రస్తుతం యువ క్రికెటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. నాలోనూ ఎంతో క్రికెట్ మిగిలుంది. మరో ఐదేళ్లకు నేను 45 పడిలోకి ప్రవేశిస్తా. ప్రస్తుతం నేను కాస్త స్లోగా బ్యాటింగ్ చేస్తున్నట్లు అన్పిస్తోంది. అంతర్జాతీయంగా 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నా. మరికొంతకాలం క్రికెట్ ఆడగలననే అనుకుంటున్నా’ అని గేల్ తెలిపాడు. 90వ దశకంలో అరంగేట్రం చేసి క్రికెట్లో కొనసాగుతున్న ఇద్దరు ప్లేయర్లలో గేల్ ఒకడు. మరో క్రికెటర్ పాక్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్. ఇక విదేశీలీగ్‌ల్లో గేల్‌కు మంచి రికార్డు ఉంది. తాను క్రౌడ్ పుల్లర్‌గా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే బంగ్లాదేశ్ ప్రీమియర్‌ లీగ్‌లోనూ తాను ఆడనున్నాడు. ఇప్పటివరకు విదేశీలీగ్‌ల్లో 400కు పైగా మ్యాచ్‌లాడిన గేల్.. 22 సెంచరీలతో 13వేలకుపైగా పరుగులు పూర్తి చేసుకున్నాడు.

Read Also : టీ20ల్లో నెం.1 రికార్డ్‌కి వికెట్ దూరంలో బుమ్రా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.