యాప్నగరం

బెరుకు లేకుండా ఆడటంలో రైనా దిట్ట..!

మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. బెరుకు లేకుండా హిట్టింగ్ చేయడం సురేశ్ రైనా ‘స్టైల్’ అని టీమిండియా ప్రధాన కోచ్

TNN 3 Mar 2018, 12:21 pm
మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. బెరుకు లేకుండా హిట్టింగ్ చేయడం సురేశ్ రైనా ‘స్టైల్’ అని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌తో.. మళ్లీ టీమిండియాలోకి ఏడాది తర్వాత పునరాగమనం చేసిన రైనా.. చివరి టీ20లో కేవలం 27 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. ఉత్కంఠగా ముగిసిన ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత్ మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకోగా.. రైనాకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మొత్తంగా ఈ సిరీస్‌లో రైనా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన సెలక్టర్లు.. మార్చి 6 నుంచి శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు టీ20 టోర్నీకి అవకాశం కల్పించారు.
Samayam Telugu coach ravi shastri calls suresh raina fearless cricketer
బెరుకు లేకుండా ఆడటంలో రైనా దిట్ట..!


సఫారీ గడ్డపై టీమిండియా పర్యటన విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి.. రైనా హిట్టింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘టీ20ల్లో రైనాకి అపారమైన అనుభవం ఉంది. అది జట్టుకి ఎంతలా ఉపయోగపడుతుందో సఫారీ గడ్డపై అతను చూపించాడు. బెరుకు లేకుండా స్వేచ్ఛగా హిట్టింగ్ చేయడం అతనిలో నాకు బాగా నచ్చే అంశం. సాధారణంగా పునరాగమనంలో క్రికెటర్లు ఆందోళనలో ఉంటారు. మెరుగైన ప్రదర్శన చేయలేకపోతే మళ్లీ స్థానం పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనని భయంతో అతి జాగ్రత్తగా ఆడతారు. దీంతో క్రికెటర్‌పై ఒత్తిడి రెట్టింపవుతుంటుంది. కానీ.. రైనాకి అలాంటి భయమే ఉండదు. హిట్టింగ్ చేయడాన్ని అతను బాగా ఇష్టపడతాడు’ అని రవిశాస్త్రి వివరించాడు. మూడో టీ20లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే రైనా సిక్సర్‌గా మలిచిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.