యాప్నగరం

IND vs IRE: కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో టీమిండియా ప్రాక్టీస్ షురూ!

India tour of Ireland 2022: ఐర్లాండ్ గడ్డపై గత గురువారం అడుగుపెట్టిన భారత టీ20 జట్టు శుక్రవారం రెస్ట్ తీసుకుని.. ఈరోజు నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆటగాళ్లకి సూచనలు చేస్తూ కనిపించాడు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 25 Jun 2022, 5:39 pm

ప్రధానాంశాలు:

  • భారత్, ఐర్లాండ్ మధ్య ఆదివారం ఫస్ట్ టీ20
  • ఈరోజు ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన టీమిండియా
  • ఐర్లాండ్ టూర్‌కి కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
  • రేపు రాత్రి 9 గంటలకి మ్యాచ్ స్టార్ట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu India tour of Ireland (Pic Credit: BCCI/Twitter)
ఐర్లాండ్ గడ్డపై‌కి టీ20 సిరీస్ కోసం వెళ్లిన టీమిండియా శనివారం ప్రాక్టీస్‌ని మొదలు పెట్టింది. ఐర్లాండ్‌తో ఆదివారం ఫస్ట్ టీ20 మ్యాచ్‌ని ఆడనున్న భారత్ జట్టు.. ఆ తర్వాత మంగళవారం రాత్రి రెండో టీ20లో తలపడబోతోంది. ఈ రెండు టీ20 మ్యాచ్‌లకి డబ్లిన్ ఆతిథ్యం ఇవ్వబోతుండగా.. భారత కాలమాన ప్రకారం మ్యాచ్‌లు రాత్రి 9 గంటలకి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు గత గురువారమే అక్కడికి భారత క్రికెటర్లు చేరుకున్నారు.
రెండు టీ20ల ఈ సిరీస్‌ కోసం 17 మందితో కూడిన భారత్ జట్టుని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ టీమ్‌కి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య ఎంపికవగా.. కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న భారత టెస్టు టీమ్‌తో ఉన్నాడు. హార్దిక్ పాండ్య భారత్ జట్టుకి కెప్టెన్సీ వహించబోతుండటం ఇదే తొలిసారికాగా.. వీవీఎస్ లక్ష్మణ్‌ కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటం కూడా ఇదే మొదటిసారి. దాంతో.. సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఐర్లాండ్ టూర్‌కి భారత టీ20 జట్టు: రుతురాజ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్, సంజు శాంసన్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, యుజ్వేందర్ చాహల్, ఉమ్రాన్ మాలిక్.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.