యాప్నగరం

ఇంగ్లాండ్‌లో మే 28 వరకూ క్రికెట్ రద్దు

కరోనా వైరస్ కారణంగా బీసీసీఐ ఏప్రిల్ 15 వరకూ క్రికెట్ సిరీస్‌లను రద్దు చేయగా.. ఇంగ్లాండ్ మాత్రం ఏకంగా మే 28 వరకూ ఎలాంటి క్రికెట్ టోర్నీలు జరగడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.

Samayam Telugu 21 Mar 2020, 11:23 am
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని క్రికెట్ టోర్నీలను ఉన్నపళంగా నిలిపివేస్తూ.. మే 28 వరకూ ప్రొఫెషనల్ క్రికెట్‌ని రద్దు చేసింది. ఈ మేరకు ఫస్ట్ క్లాస్ కౌంటీ జట్లతో పాటు ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోషియేషన్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈసీబీ తుది నిర్ణయం ప్రకటించింది.
Samayam Telugu South Africa England Cricket


కోవిడ్-19 వేగంగా వ్యాపిస్తుండటంతో ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తాత్కాలికంగా సిరీస్‌లను రద్దు చేశాయి. కానీ.. ఇంగ్లాండ్ మాత్రం మే 28 వరకూ అని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి గత వారమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా సిరీస్‌లను రద్దు చేయడంతో పాటు ఐపీఎల్ 2020 సీజన్‌ని వాయిదా వేసింది. అయితే.. కరోనా వైరస్‌ వ్యాప్తిపై గత వారం ఓ అంచానికి రాలేకపోయిన బీసీసీఐ.. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్‌ని ఏప్రిల్ 15కి వాయిదా వేసింది. కానీ.. ఇప్పుడు టోర్నీ జరగడంపైనా సందేహాలు నెలకొన్నాయి.

ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌‌లో ఆడిన ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌కి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో.. ఆగమేఘాల మీద అతడ్ని స్వదేశానికి పాక్ పంపించేసింది. కానీ.. శాంపిల్స్ పరీక్షలో అతనికి నెగటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈరోజు స్కాట్లాండ్‌కి చెందిన క్రికెటర్ మజిద్ హక్‌కి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో.. క్రికెట్ ప్రపంచం అప్రమత్తమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.