యాప్నగరం

కరోనా టైమ్‌లో ధోనీని వాడేస్తున్న తిరుప్పూర్ పోలీసులు

తిరుప్పూర్ పోలీసుల ఐడియా అదిరింది. తమిళనాడులో ధోనీకి ఉన్న క్రేజ్‌ని కరోనా వైరస్ కట్టడికి చక్కగా వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ధోనీ పేరుకి మరో సరికొత్త అర్థాన్ని కూడా వాళ్లు తీసుకొచ్చారు.

Samayam Telugu 21 Jul 2020, 10:41 am
కరోనా వైరస్ పతాక స్థాయిలో వ్యాపిస్తుండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు భిన్నమైన శైలిలో ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా.. సామాజిక దూరం పాటించాలని హితవు పలుకుతూ.. బ్యానర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ.. ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. దాంతో.. క్రికెటర్ల ఫొటోలతో పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. భారత్‌లో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ మరే క్రీడకీ లేని విషయం తెలిసిందే.
Samayam Telugu MS Dhoni, Rohit Sharma


తమిళనాడులోని తిరుప్పూర్ సిటీ పోలీసులు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫొటోతో పాటు పేరుని కూడా సోషల్ మీడియాలో.. సామాజిక దూరంపై అవగాహన కోసం వాడేస్తున్నారు. ధోనీ, రోహిత్ శర్మ మైదానంలో కాస్త దూరంగా నడుస్తున్న ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేసిన పోలీసులు.. M S D-maintain social distance అని ధోనీ పేరుకి కొత్త అర్థాన్ని తెరపైకి తీసుకొచ్చారు.


వాస్తవానికి తమిళనాడులో ధోనీకి మంచి క్రేజ్‌ ఉంది. ఆ రాష్ట్రానికి చెందిన చెన్నై సూపర్ కింగ్స్‌ని ఐపీఎల్ ఆరంభం నుంచి నడిపిస్తున్న ధోనీ.. మూడు సార్లు టోర్నీ విజేతగా నిలిపాడు. దాంతో.. ధోనీని అందరూ అక్కడ ముద్దుగా ‘తలా’ అని పిలుస్తుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.