యాప్నగరం

శతకంతో ఫామ్‌లోకి వచ్చిన మురళీ విజయ్

నాటింగ్‌షైర్‌తో గురువారం ముగిసిన ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేసిన మురళీ విజయ్ రెండో ఇన్నింగ్స్‌లో 181 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి ఔటయ్యాడు

Samayam Telugu 13 Sep 2018, 9:13 pm
ఇంగ్లాండ్ గడ్డపై తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత ఓపెనర్ మురళీ విజయ్ మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. ఎసెక్స్‌ తరఫున కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన ఈ ఓపెనర్ తొలి మ్యాచ్‌లోనే శతకంతో ఆ జట్టుకి ఘన విజయాన్ని అందించాడు. ఈ టోర్నీ అరంగేట్రం మ్యాచ్‌లోనే శతకం సాధించిన రెండో క్రికెటర్‌గా మురళీ విజయ్ తాజాగా నిలిచాడు. 2009లో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హసీమ్ ఆమ్లా తొలి మ్యాచ్‌లోనే శతకంతో ఈ రికార్డుని నెలకొల్పాడు.
Samayam Telugu Bengaluru: Indias Murali Vijay celebrates his fifty runs on the first day of t...
India's Murali Vijay celebrates his fifty runs on the first day of the one-off cricket test match against Afghanistan, at Chinnaswamy Stadium in Bengaluru on Thursday, June 14, 2018.Photo/Shailendra Bhojak)


నాటింగ్‌షైర్‌తో గురువారం ముగిసిన ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేసిన మురళీ విజయ్ రెండో ఇన్నింగ్స్‌లో 181 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో.. 282 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్‌ జట్టు 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.

ఇంగ్లాండ్‌పై తొలి రెండు టెస్టుల్లో మురళీ విజయ్ విఫలమవడంతో.. మూడో టెస్టులో అతనిపై వేటు పడింది. ఆ తర్వాత జరిగిన 4, 5వ టెస్టుల కోసం అతడ్ని సెలక్టర్లు కనీసం జట్టులోకి కూడా ఎంపిక చేయలేదు. మురళీ విజయ్ స్థానంలో యువ ఓపెనర్ పృధ్వీ షా‌కి జట్టులో అవకాశం కల్పించారు. దీంతో.. వారం రోజులు విశ్రాంతి తీసుకున్న మురళీ విజయ్.. ఇటీవలే ఎసెక్స్‌‌కి ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.