యాప్నగరం

ఐపీఎల్ లేని క్రికెట్ క్యాలెండర్‌లో అర్థంలేదు: జాంటీ రోడ్స్

మహేంద్రసింగ్ ధోనీ లాంటి దిగ్గజ క్రికెటర్ కెరీర్ ఇప్పుడు ఐపీఎల్ ప్రదర్శనపై ఆధారపడి ఉంది. అతనే కాదు.. చాలా మంది భారత క్రికెటర్లు ఐపీఎల్‌పై గంపెడాశలతో ఉన్నారు.

Samayam Telugu 10 Jul 2020, 8:43 am
ఐపీఎల్ లేకుండా క్రికెట్ క్యాలెండర్‌ని ఊహించుకోవడం కష్టమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడతారని గుర్తుచేసిన జాంటీరోడ్స్.. ఆర్థికంగా వారికి ఈ ఐపీఎల్ ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించాడు.
Samayam Telugu IPL Trophy
( IPL Twitter handle)


షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరవధికంగా వాయిదావేసింది. అయితే.. అక్టోబరు- నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడే సూచనలు కనిపిస్తుండటంతో.. ఆ విండోలో ఐపీఎల్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.


‘‘ఐపీఎల్‌ క్రికెటర్లకి ఆర్థికంగా, భవిష్యత్‌ పరంగా చాలా ముఖ్యమైన టోర్నీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడతారు. అందుకే.. ఐపీఎల్‌ లేని క్రికెట్ క్యాలెండర్‌లో అర్థం లేదని నా భావన. ఈ ఏడాది చివరికి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి.. ఐపీఎల్ జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని జాంటీ రోడ్స్ వెల్లడించాడు.

ఐపీఎల్ 2020 సీజన్ రద్దయితే బీసీసీఐ సుమారు రూ.4000 కోట్లు నష్టపోనుండగా.. వందల మంది క్రికెటర్లకి కూడా రూ. కోట్లు చేజారనున్నాయి. ఇందులో భారత క్రికెటర్లే ఎక్కువ. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, పార్థీవ్ పటేల్ లాంటి క్రికెటర్లు కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతూ క్రికెట్‌లో కొనసాగుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.