టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య ఇంట్లో త్వరలోనే పెళ్లి వేడుక జరగనుంది. హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో ఆడుతున్న పాండ్య పంఖురి శర్మ అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. వీరిద్దరూ ఏడాదిన్నరగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ముంబైలోని శాంట్రా క్రాజ్ ఫైవ్ స్టార్ హోటల్లో కుటుంబ సభ్యులు, సమీప బంధువుల మధ్య డిసెంబర్ 27న కృనాల్ వివాహ వేడుక జరగనుంది. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు కృనాల్ తెలిపాడు.
‘నా ఫ్రెండ్ ద్వారా ఫంఖురి పరిచయం. రెండేళ్ల కిందట ఇద్దరం కలిశాం. మెల్లగా ఒకరంటే మరొకరికి ఇష్టం కలిగింది. ఇద్దరిదీ ఒకే వయసు. తను చాలా సింపుల్‌గా ఉంటుంది. నాకెంతో మద్దతునిస్తుంద’ని కృనాల్ తెలిపాడు. గతంలో ఫిల్మ్ మార్కెటింగ్‌లో పని చేసిన పంఖురి గత ఏడాది ఆ వృత్తి నుంచి బయటకు వచ్చేసింది.
కాబోయే భార్యకు తానే ముందు ప్రపోజ్ చేశానని కృనాల్ తెలిపాడు. ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు పెళ్లాడదామని ప్రపోజ్ చేశాను. ఐపీఎల్ ఫైనల్లో నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. కాబట్టి అదే సరైన తరుణమని భావించానని కృనాల్ చెప్పాడు. అందుకు వెంటనే ఆమె కూడా ఓకే చెప్పడంతో పాండ్య వాళ్ల ఇంట్లో అంతా సంతోషించారట.