యాప్నగరం

ఆర్పీ సింగ్‌కి సెహ్వాగ్ అభినందనలు!

ట్విట్టర్‌లో ఎప్పుడూ భిన్నంగా స్పందించే వీరూ ఈసారి కూడా ఆర్పీ సింగ్‌కు అదే స్టైల్‌లో రిప్లై ఇచ్చాడు.

TNN 7 Feb 2017, 5:47 pm
టీం ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్‌ తండ్రయ్యాడు. తన భార్య దేవాన్షి పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆర్పీ సింగ్ మంగళవారం ట్వీట్ చేసాడు. పాపకు ఐరా ఆర్య అని నామకరణం చేసినట్లు పేర్కొన్నాడు. హరహర మహదేవ్ హ్యాష్ టాగ్‌తో చేసిన ఈ ట్వీట్‌పై డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
Samayam Telugu cricketer rp singh blessed with baby girl sehwag congratulates him
ఆర్పీ సింగ్‌కి సెహ్వాగ్ అభినందనలు!


ట్విట్టర్‌లో ఎప్పుడూ భిన్నంగా స్పందించే వీరూ ఈసారి కూడా అదే స్టైల్‌లో రిప్లై ఇచ్చాడు. ‘హర హర మహదేవ్‌’తో ప్రారంభించిన ఆ ట్వీట్‌లో ఆర్పీ సింగ్‌కు అభినందనలు తెలిపాడు. ఐరా ఆర్య పేరు చాలా అందంగా ఉందని కొనియాడాడు. చిన్నారికి ప్రేమతో.. అని ట్వీట్‌ను ముగించాడు పాజి. కాగా, ఆర్పీ సింగ్‌కు దేవాన్షి పోపట్‌తో 2012 డిసెంబర్ 1న వివాహం జరిగింది. వీరికి ఐరా ఆర్యనే తొలి సంతానం.
Har Har Mahadev. Congratulations @RpSingh99 and a beautiful name Ira Aarya. Love to the little one. https://t.co/NXYlC2Vozu — Virender Sehwag (@virendersehwag) February 7, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.