యాప్నగరం

నా జీవితంలో ఇదే చీకటి రోజు: మిథాలీ రాజ్

నాపై వస్తున్న ఆరోపణలు చాలా వేదనకి గురిచేస్తున్నాయి. దేశం తరఫున 20 ఏళ్లపాటు నిబద్ధతతో క్రికెట్ ఆడాను. కానీ.. ఇన్నాళ్ల నా శ్రమకి ఫలితం లేకుండా పోయింది. -మిథాలీ రాజ్

Samayam Telugu 29 Nov 2018, 1:49 pm
భారత మహిళల జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ‌పై చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన సెమీస్ మ్యాచ్‌‌కి మిథాలీ రాజ్‌పై టీమ్ వేటు వేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగగా.. నిన్న కోచ్ రమేశ్ పొవార్ ఇచ్చిన వివరణ వాటికి మరింత ఆజ్యం పోసింది.
Samayam Telugu jpg.


బీసీసీఐ పెద్దలతో బుధవారం మాట్లాడిన రమేశ్ పొవార్.. మిథాలీ రాజ్ ఓపెనింగ్‌లోనే ఆడతానని పట్టుబట్టిందని.. ఒకవేళ ఒప్పుకోని పక్షంలో టోర్నీ నుంచి వైదొలిగి రిటైర్మెంట్ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు అతను చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. ఆమె వ్యక్తిగత రికార్డ్స్ కోసమే ఆడుతోందని.. జట్టు అవసరాలను పట్టించుకోదని ఆరోపించిన పొవార్.. స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉండటంతోనే సెమీస్‌లో పక్కన పెట్టినట్లు వివరించాడు.

బీసీసీఐకి రమేశ్ పొవార్ ఇచ్చిన వివరణపై ఈరోజు మిథాలీ రాజ్ స్పందించింది. ‘నాపై వస్తున్న ఆరోపణలు చాలా వేదనకి గురిచేస్తున్నాయి. దేశం తరఫున 20 ఏళ్లపాటు నిబద్ధతతో క్రికెట్ ఆడాను. కానీ.. ఇన్నాళ్ల నా శ్రమకి ఫలితం లేకుండా పోయింది. ఈరోజు.. నా దేశభక్తిని సందేహిస్తున్నారు. నా నైపుణ్యాల్ని ప్రశ్నిస్తున్నారు. నా జీవితంలో ఇది చీకటి రోజు. ఈ కష్టాల్ని తట్టుకునే శక్తి దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని మిథాలీ రాజ్ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.