యాప్నగరం

ఆటోగ్రాఫ్ ఇస్తున్న క్రికెటర్‌కు వార్నర్ షాక్..! (వీడియో)

మైదానంలో ఆటగాళ్లకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న బీబీఎల్ ప్లేయర్ రషీద్ ఖాన్‌కు సరదాగా డేవిడ్ వార్నర్ షాకిచ్చాడు. రషీద్‌ను బ్యాట్‌తో విష్ చేసి నవ్వులు పూయించాడు. ప్రస్తుతం ఇది నెట్‌లో వైరలైంది.

Samayam Telugu 29 Dec 2019, 8:20 pm

ప్రధానాంశాలు:

  • బ్యాట్‌తో ఫన్నీగా రషీద్‌ను విష్ చేసిన వార్నర్
  • వార్నర్ విష్‌తో అవాక్కయిన రషీద్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu david warner wishes rashid khan in a funny way at mcg
ఆటోగ్రాఫ్ ఇస్తున్న క్రికెటర్‌కు వార్నర్ షాక్..! (వీడియో)
ఆస్ర్టేలియాలోని ప్రముఖ మెల్‌బోర్న క్రికెట్ మైదానంలో ఆదివారం ఇక ఆసక్తికరఘటన చోటు చేసుకుంది. మైదానంలో ఆటోగ్రాఫ్ ఇస్తున్న అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనదైన శైలిలో గ్రీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరలైంది. సోషల్ మీడియలో నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Read Also : మీలాగా డబ్బుల కోసం దేశాన్ని అమ్మలేదు.. ఫైరైన పాక్ క్రికెటర్

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ జట్టు తరపున ఆడుతున్న రషీద్.. ఆదివారం మ్యాచ్ ముగిశాక అభిమానులకు సరదాగా ఆటోగ్రాఫ్‌లు ఇస్తు్న్నాడు. అయితే అక్కడే ఆస్ర్టేలియా-న్యూజిలాండ్ మ్యాచ్ ముగిశాక పెవిలియన్‌కు వస్తున్న వార్నర్ కంట రషీద్ పడ్డాడు. రషీద్‌ను చూసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చేతిలోని బ్యాట్‌తో ఆఫ్గాన్ ప్లేయర్‌‌ను వార్నర్ విష్ చేశాడు. ఈ వీడియోను అడిలైడ్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

Read Also : డివిలియర్స్ తర్వాత ఆ ప్లేయరే మిస్టర్ 360: స్టెయిన్
మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున వార్నర్, రషీద్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో వారిద్దరి మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో రషీద్‌ను చూసిన వెంటనే బ్యాట్‌తో వార్నర్ గ్రీట్ చేశాడని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో కివీస్‌పై ఆసీస్, మెల్‌బోర్న్‌పై అడిలైడ్ విజయం సాధించడం విశేషం.

Read Also : ఇలాంటి ఔట్‌ను ఎప్పుడూ చూసి ఉండరు (వీడియో)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.