యాప్నగరం

మలాన్-బట్లర్ వరల్డ్ రికార్డ్.. సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్

దక్షిణాఫ్రికా గడ్డ మీద ఇంగ్లాండ్ జట్టు టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మూడో టీ20లో మలాన్-బట్లర్ జోడి 90 బంతుల్లోనే 167 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో.. 192 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.

Samayam Telugu 2 Dec 2020, 8:57 am
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లిష్ జట్టు మరో 14 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్ జేసన్ రాయ్ 16 పరుగులకే ఔటైనా.. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన డేవిడ్ మలాన్ 47 బంతుల్లోనే 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ జాస్ బట్లర్ 46 బంతుల్లో 67 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ సునాయాసంగా విజయం సాధించింది.
Samayam Telugu malan-buttler
Image: Twitter/ICC


మలాన్-బట్లర్ జోడి రెండో వికెట్‌కు 90 బంతుల్లోనే 167 పరుగులు జోడించి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మలాన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

మూడో టీ20లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా 9.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 64 పరుగులే చేసింది. కానీ డుపెస్లిస్ (37 బంతుల్లో 52 నాటౌట్), వాన్ డెర్ డస్సెన్ (32 బంతుల్లో 74 నాటౌట్) దూకుడుగా ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 66 బంతుల్లోనే 127 పరుగులు జోడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.