యాప్నగరం

ఈ జట్టేనా 2019 ప్రపంచకప్ గెలిచేది..?

భారత్ చేతిలో వన్డే సిరీస్‌ చేజార్చుకున్న దక్షిణాఫ్రికాపై ఆ జట్టు కోచ్ గిబ్సన్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. 2019 ప్రపంచకప్‌ని

TNN 14 Feb 2018, 6:07 pm
భారత్ చేతిలో వన్డే సిరీస్‌ చేజార్చుకున్న దక్షిణాఫ్రికాపై ఆ జట్టు కోచ్ గిబ్సన్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. 2019 ప్రపంచకప్‌ని లక్ష్యంగా పెట్టుకుని దక్షిణాఫ్రికా జట్టును సిద్ధం చేస్తుంటే.. ప్రదర్శన రోజురోజుకీ మరీ తీసికట్టుగా మారుతోందని కోచ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం రాత్రి ముగిసిన ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. ఓపెనర్ రోహిత్ శర్మ శతకం బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా.. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో ఆరు వన్డేల సిరీస్‌ని భారత్ 4-1తో చేజిక్కించుకుంది.
Samayam Telugu defeats against india have given us food for thought going forward believes south africa coach ottis gibson
ఈ జట్టేనా 2019 ప్రపంచకప్ గెలిచేది..?


‘మంగళవారం రాత్రి దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శన మరీ పేలవంగా ఉంది. వచ్చే ఏడాది ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే జట్టు సిద్ధమవుతోందని జట్టులోని ఆటగాళ్లందరికీ తెలుసు. కానీ.. వారు తమ ఆటతీరుని మార్చుకోలేదు. ఇలాంటి జట్టుతో మెగా టోర్నీకి ఎలా వెళ్లగలం..? భారత జట్టులో ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లున్నారు. అయితే.. ప్రపంచకప్‌లో వారిని మళ్లీ ఎదుర్కోనేందుకు దక్షిణాఫ్రికా దగ్గర ఏడాది సమయముంది. కానీ.. ఇక్కడ తేలాల్సింది ఒక్కటే. ప్రపంచకప్ జరిగే ఇంగ్లాండ్‌లో పిచ్‌లు ఈ మణికట్టు స్పిన్నర్లకి ఇక్కడిలానే అనుకూలిస్తాయా..?’ అని గిబ్సన్ సందేహం వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్‌లో చివరి వన్డే శుక్రవారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.