యాప్నగరం

బంగ్లా చేతిలో ఓటమి.. ఆసియా కప్ నుంచి భారత్ ఔట్

డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసియా కప్‌ టోర్నీలో అడుగుపెట్టిన భారత జట్టు అనూహ్య రీతిలో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.

TNN 14 Nov 2017, 6:08 pm
ఆసియా కప్ నుంచి భారత అండర్ 19 జట్టు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన యువ భారత జట్టు మూడు రోజుల్లో రెండు ఓటముల కారణంగా రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆదివారం నేపాల్ చేతిలో ఓడిన టీమిండియా బంగ్లాదేశ్‌ చేతిలోనూ ఓటమి పాలైంది. దీంతో గ్రూప్-ఏ నుంచి నేపాల్, బంగ్లాదేశ్ ముందంజ వేశాయి. సెమీఫైనల్లో ఆ జట్లు పాకిస్థాన్, అప్ఘానిస్థాన్‌లతో తలపడతాయి. 2012లో పాకిస్థాన్‌తో కలిసి కప్‌ను పంచుకున్న భారత జట్టు, 2014, 2014ల్లో విజేతగా నిలిచింది.
Samayam Telugu defending champion india u19 out of the asia cup
బంగ్లా చేతిలో ఓటమి.. ఆసియా కప్ నుంచి భారత్ ఔట్


వర్షం ఆటంకం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 32 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బదులుగా బంగ్లా జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 28 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. టీమిండియాలో ఒక్కరు కూడా అర్ధ సెంచరీ సాధించలేదు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సల్మాన్ ఖాన్ (39 నాటౌట్)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. బంగ్లా ఓపెనర్ పినాక్ ఘోష్ 81 పరుగులు చేయడంతో ఆ జట్టు సునాయాసంగా గెలుపొందింది.

ఈ ఓటమి భారత అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్‌‌ను నిరుత్సాహానికి గురిచేశాయి. కానీ వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ చెప్పాడు. ఇప్పటికైతే ఫలితాలపై దృష్టి పెట్టడం లేదని, కుర్రాళ్లలోని ప్రతిభను వెలికి తీయడం, ఆటగాళ్ల నైపుణ్యాలు మెరుగు పర్చడం మీదే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నామని తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.